Begin typing your search above and press return to search.

పవర్ స్టార్… ఇది రియల్ పాన్ ఇండియా క్రేజ్

దేశవ్యాప్తంగా పవన్ కి లభించిన ఈ విశేషమైన గుర్తింపు ఆయన పాన్ ఇండియా సినిమాలకు కూడా హెల్ప్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By:  Tupaki Desk   |   9 Jun 2024 4:41 AM GMT
పవర్ స్టార్… ఇది రియల్ పాన్ ఇండియా క్రేజ్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే పేరు వినిపిస్తోంది. నేషనల్ మీడియా ఛానల్స్ పవన్ కళ్యాణ్ పైన స్పెషల్ స్టోరీలు ప్రసారం చేస్తున్నాయి. ఆయనను గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తూ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మునిపెన్నడు సాధించని స్థాయిలో కూటమి 164 ఓ స్థానాలలో గెలుపొందింది. ఈ అఖండ విజయం వెనుక పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ బలంగా చెబుతున్నారు.

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ని ఆవేశపరుడుగా, నిలకడ లేని రాజకీయ నాయకుడిగా అభివర్ణించిన వారు ఇప్పుడు ఆయన రాజకీయ చతురత గురించి గొప్పగా చెబుతున్నారు. ఒంటరిగా వచ్చిన కూటమిగా వచ్చిన అంతిమంగా గెలవడం ముఖ్యం. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో 100% సక్సెస్ అయ్యారు. అందుకే ఈరోజు దేశం మొత్తం ఇటు నేషనల్ మీడియా అటు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి విస్తృత చర్చ నడుస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ రణక్షేత్రంలో పవన్ కళ్యాణ్ తనదైన భూమిక పోషించారు.

తాజాగా జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పక్షాల సమావేశంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ని ప్రశంసించడం విశేషం. పవన్ కళ్యాణ్ లో అందరూ పవర్ స్టార్ అంటారు కానీ అతను తుఫాన్ అంటూ ప్రధాని మోడీ అభివర్ణించడం విశేషం. దీనిని నేషనల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కి స్పెషల్ ఫోకస్ వచ్చేలా చేస్తోంది. దేశవ్యాప్తంగా పవన్ కి లభించిన ఈ విశేషమైన గుర్తింపు ఆయన పాన్ ఇండియా సినిమాలకు కూడా హెల్ప్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్నారు. అలాగే హరిహర వీరమల్లు మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలకు పవన్ కళ్యాణ్ పొలిటికల్ చరిష్మా కలిసొస్తుందని భావిస్తున్నారు. బిజినెస్ పరంగా హెల్ప్ కావడంతో పాటు దేశ వ్యాప్తంగా వీటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే నేషనల్ స్థాయిలో ఇన్ ఫ్లూయెన్సర్స్ సైతం పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు. నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ని తుఫాన్ అంటూ పోల్చడం పై రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ స్టామినా, ఫ్యాన్ బేస్ ఏ స్థాయిలో ఉందో వీడియోల ద్వారా పరిచయం చేస్తున్నారు. ఒక విదంగా ఇది రియల్ పాన్ ఇండియా క్రేజ్ అనేలా కామెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆయన మూవీ కెరియర్ కి కచ్చితంగా హెల్ప్ అవుతాయని సినీ విశ్లేషకులు చెబుతున్న మాట.