పవన్ ముందు త్రివిక్రమ్.. మరో రెండు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
By: Tupaki Desk | 22 May 2024 8:27 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి బాండింగ్ చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైనది. పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడైన త్రివిక్రమ్ పైన ఎంతో నమ్మకంతో ఉంటాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, OG వంటి చిత్రాలందరికీ త్రివిక్రమ్ తెరవెనుక ఎంత సపోర్ట్ గా ఉన్నారో అందరికి తెలిసిందే.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విరామం తీసుకుని, తన పాత చిత్రాలు మరియు కొత్త ప్రాజెక్టుల పై దృష్టి సారిస్తున్నారు. OG షూట్ ను ఫస్ట్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇక హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల పెండింగ్ ఉన్న భాగాలను ఆ తరువాత పూర్తిచేయాల్సి ఉంది. ఇక మరోవైపు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కు రాబోయే ప్రాజెక్టులను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
ముందుగా త్రివిక్రమ్ కథ విని ఓకే చేస్తే పవన్ దాన్ని చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు. పవన్ రెగ్యులర్ పాలిటిక్స్ లో బిజీ అయినప్పటి నుంచి ఈ తరహా పద్ధతి కొనసాగుతోంది. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం యువ దర్శకులతో చర్చలు నిర్వహిస్తూ, వారి స్క్రిప్టులను వింటున్నారు. పవన్ కళ్యాణ్ కోసం కొత్తగా రెండు చిత్రాలను లైన్ లో పెడుతున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రాల్లో ఒకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఖరారు కానున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విరామంలో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి చిత్రాలకు రావడానికి సిద్ధంగా ఉంటారు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కు సర్వసిద్ధమైన చిత్రాలను సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పై నమ్మకం ఉంచడం వల్ల, ఈ ప్రాజెక్టులు ప్రేక్షకులకు పెద్ద ఎత్తున అంచనాలు కలిగిస్తున్నాయి.
త్రివిక్రమ్ పాత్ర వల్లే గత చిత్రాలు పెద్ద విజయం సాధించడం వల్ల, అభిమానులు భవిష్యత్తులో రాబోయే చిత్రాలపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ మధ్య ఉన్న ఈ మాంత్రిక అనుబంధం, చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం పొందింది. ఇక రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ అది ఇప్పట్లో జరిగే పనిలా కనిపించడం లేదు.
వీరిద్దరూ సినిమా చేస్తున్నారు అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అజ్ఞాతవాసి ఫస్ట్ డే కలెక్షన్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్స్ అంచనాలు అందుకేనంత పర్ఫెప్ట్ స్క్రిప్ట్ రెడీ అయితే తప్ప త్రివిక్రమ్ సినిమా చేయడానికి ఒప్పుకోకపోవచ్చు. ఇక చివరగా వీరి కలయికలో వచ్చిన ఆజ్ఞతవాసి డిజాస్టర్ అయ్యింది. దాన్ని మర్చిపోయేలా త్రివిక్రమ్ ఒక హిట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.