పవన్ పొలిటికల్ జంప్.. అయినా ఆగని హరీష్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల బ్రో మూవీతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ఈ మూవీలో పవన్ ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.
By: Tupaki Desk | 10 Sep 2023 6:42 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల బ్రో మూవీతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ఈ మూవీలో పవన్ ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన చేతిలో చాలా సినిమాలు ఉండటంతో, వరసగా సినిమాలు వచ్చేస్తాయని ఫ్యాన్స్ భావించారు. ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ త్వరగా పూర్తి చేస్తారని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆశపడ్డారు. కానీ, ఒక్కసారిగా సీన్ అంతా రివర్స్ అయిపోయింది.
సడెన్ గా పవన్ రాజకీయాలపై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పవన్ సీరియస్ అయ్యారు. వెంటనే యాక్షన్ లో దిగి, చంద్రబాబుని కలవాలని అనుకున్నారు. కానీ పోలీసులు పవన్ ని అడ్డుకున్నారు.
నిజానికి ఆయన ఉస్తాద్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఈ సడెన్ పరిణామానికి వెంటనే రియాక్ట్ అయ్యి, విజయవాడ వెళ్లారు. పోలీసులు అడ్డుకున్నా కూడా వెనకాడకుండా, రోడ్డుపై పడుకొని మరీ నిరసన తెలిపాడు. పవన్ కి సినిమాలు చేయడం ఎంత ముఖ్యమో, రాజకీయంగా యాక్టివ్ గా ఉండటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి, ఈ విషయంలో ఆయనకు ఫ్యాన్స్ మద్దతుగానే ఉన్నారు.
కానీ, ఇలా పవన్ సడెన్ గా షూటింగ్స్ ఆపేయడం వల్ల నిర్మాతల పరిస్థితి ఏంటా అనే చర్చమొదలైంది. కానీ, నిర్మాతలు , దర్శకులు ఇలాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉన్నారట. ఆయన ముందుగానే ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని, సిద్ధంగా ఉండమని చెప్పారట. అందుకు అంగీకరించే వారు పవన్ తో మూవీ చేస్తుండటం విశేషం.
ఇక, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికి వస్తే, పవన్ సడెన్ గా షూటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్లిపోయినా, డైరెక్టర్ హరీష్ శంకర్ షూటింగ్ ఆపేయలేదట. పవన్ లేకుండా ఇతర నటులతో ఉండే సీన్స్ ని తెరకెక్కిస్తున్నారట. ఎలా అయినా కూడా పవన్ లేకుండా ఈ మూవీ పూర్తయ్యే అవకాశం లేదు. మూవీ లైన్ లోకి వచ్చింది అనుకునేలోపు మళ్లీ ట్రాక్ తప్పుతూనే ఉంది. ఇక, ఈ మూవీలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.