Begin typing your search above and press return to search.

పవన్, ప్రభాస్, వరల్డ్ కప్.. జూన్ కిక్కు అదిరింది!

జూన్ నెల మెగా, పవర్ స్టార్ అభిమానులకి, అలాగే సినీ ఇండస్ట్రీలో చాలా మంది రాజకీయంగా పవన్ కళ్యాణ్ విజయం సంతోషాన్ని ఇచ్చింది.

By:  Tupaki Desk   |   1 July 2024 4:42 AM GMT
పవన్, ప్రభాస్, వరల్డ్ కప్.. జూన్ కిక్కు అదిరింది!
X

ప్రస్తుతం జెనరేషన్ యూత్ బాగా కనెక్ట్ అయ్యే అంశాలు మూడు ఉంటాయి. అవి సినిమా, క్రికెట్ , పాలిటిక్స్. ముఖ్యంగా సినిమా, క్రికెట్ పైన యువత ఆసక్తి ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్లిన తర్వాత ఆయనని ఫాలో అయ్యేవారు పాలిటిక్స్ పైన కూడా ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. అలాగే జగన్ కూడా యంగ్ లీడర్ గా ఏపీలో రాజకీయాలు చేస్తూ యువతని ఆకర్షిస్తున్నారు. పవన్, జగన్ మధ్య రాజకీయాలు రసవత్తరంగా అందరికి ఆసక్తి కలిగిస్తూ ఉంటాయి.

పవన్ కళ్యాణ్ ని ఫాలో అయ్యే మెజారిటీ యువత అతనిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకున్నారు. అయితే అది సాధ్యం కాకపోయిన డిప్యూటీ సీఎం అయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ మెయిన్ పిల్లర్ అని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్న మాట. ఆయన వ్యూహాత్మక నిర్ణయాలు అన్ని కూడా వర్క్ అవుట్ అయ్యి ప్రజల్లోకి బలంగా వెళ్లి ఓటర్లని ఆకర్షించారు. అధికారంలోకి వచ్చారు. జూన్ నెల మెగా, పవర్ స్టార్ అభిమానులకి, అలాగే సినీ ఇండస్ట్రీలో చాలా మంది రాజకీయంగా పవన్ కళ్యాణ్ విజయం సంతోషాన్ని ఇచ్చింది.

రాజకీయంగా పవన్ కళ్యాణ్ చరిష్మా గురించి దేశ వ్యాప్తంగా జూన్ నెలలో చర్చ జరిగింది. ఇక టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898ఏడీ జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా వచ్చిన కల్కి సినిమా ఇంటర్నేషనల్ లెవల్ లో తెలుగు సినిమా సత్తాని పరిచయం చేసింది. అందుకే తెలుగు వాళ్లందరికి కల్కి మూవీ సక్సెస్ చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. అలాగే బాహుబలి అనంతరం ప్రభాస్ కు కిక్కిచ్చే సక్సెస్ ఇచ్చింది ఈ జూన్ నెల.

అలాగే క్రికెట్ పరంగా ఇండియా 14 ఏళ్ళ తర్వాత మరల టీ20 వరల్డ్ కప్ అందుకుంది. రోహిత్ శర్మ సారధ్యంలో ఇండియన్ క్రికెట్ టీమ్ అప్రతిహతంగా వరుస విజయాలతో వరల్డ్ కప్ అందుకొని అరుదైన రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ఇండియా వన్డే వరల్డ్ కప్ ని కొద్దిలో మిస్ చేసుకుంది. ఫైనల్ వరకు వచ్చి చతికిలపడింది. అయితే టీ20లో మాత్రం ఛాన్స్ మిస్ చేసుకోలేదు. జూన్ నెలలోనే ఇండియా టీ20 వరల్డ్ కప్ సాధించింది.

ఇలా మూడు మోస్ట్ హ్యాపీయస్ట్ మూమెంట్స్ జూన్ నెలలోనే జరగడం విశేషం. ముఖ్యంగా యువతని ఎట్రాక్ట్ చేసే మూడు రంగాలలో ఈ మూడు సంఘటనలు జరగడం యాదృశ్శిచమే. అందుకే 2024 జూన్ నెల ప్రతి ఒక్కరికి కచ్చితంగా గుర్తుండిపోతుంది. సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ఈ సంఘటనలపై మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. పవర్, రెబల్ స్టార్ స్టార్ అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ వీటిపై కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్, విరాట్ కోహ్లీ టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించడం కూడా జూన్ నెలలోనే జరిగిందని కొంతమంది గుర్తుచేస్తున్నారు.