Begin typing your search above and press return to search.

OG - అక్కడ ఓ ప్లాన్ సెట్ చేసిన సుజిత్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా పరిపాలన వ్యవహారాలలో నిమగ్నమై ఉన్నారు.

By:  Tupaki Desk   |   26 Aug 2024 9:51 AM GMT
OG - అక్కడ ఓ ప్లాన్ సెట్ చేసిన సుజిత్
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా పరిపాలన వ్యవహారాలలో నిమగ్నమై ఉన్నారు. దీంతో అతను చేయాల్సిన మూడు సినిమాల షూటింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమాలు అన్ని ఫినిష్ చేస్తానని పవన్ కళ్యాణ్ నిర్మాతలకి మాట ఇచ్చారంట. షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకోమని కూడా చెప్పారంట. దీంతో ఓజీ సినిమా షూటింగ్ ఏర్పాట్లలో దర్శకుడు సుజిత్ నిమగ్నమై ఉన్నారు. మరో వైపు హరిహరవీరమల్లు షూటింగ్ కోసం కూడా ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఏర్పాట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మాత్రం ఓజీ సినిమాని ముందుగా పూర్తి చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో ఉన్నప్పటికీ హీరో క్యారెక్టర్ విజయవాడకు లింక్ ఉంటుందట. అందుకే ఓజీ మూవీ షూటింగ్ కి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారంట. పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలు అన్ని కూడా ఈ షూటింగ్ లో ఫినిష్ చేస్తారంట. అందుకే ప్రత్యేకంగా ఇండోర్ లో షూటింగ్ కోసం ప్రత్యేకంగా సినిమాకి కావాల్సిన వాతావరణం క్రియేట్ చేసే పనిలో సుజిత్ ఉన్నారంట.

సెప్టెంబర్ ఆఖరి వారంలో లేదంటే అక్టోబర్ మొదటి వారంలో పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందంట. వారానికి రెండు రోజులు మాత్రమే షూటింగ్స్ కోసం డేట్స్ కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ కారణంగానే వేరే అవుట్ డోర్ షూటింగ్స్ ప్లాన్ చేయకుండా పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండేలా విజయవాడలోనే షెడ్యూల్ ఖారారు చేసారంట. ఎలాగూ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

టెక్నాలజీ వచ్చిన తర్వాత గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసి దానిని సినిమాలో డైరెక్టర్ విజన్ కి తగ్గట్లుగా కావాల్సిన చోట చూపించుకునే ఛాన్స్ ఉంది. ఈ వెసులుబాటుని ఓజీ కోసం సుజిత్ ఉపయోగించుకుంటున్నాడంట. వీలైనంత వేగంగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పైన దృష్టి పెట్టాలని సుజిత్ భావిస్తున్నారు. విఎస్ఎక్స్ పరంగా కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకులకి బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అందించాలని అనుకుంటున్నారు.

ఈ షూట్ కంప్లీట్ అయ్యాక హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించే ఛాన్స్ ఉందంట. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ అయితే వచ్చే ఏడాదిలోనే స్టార్ట్ అవ్వొచ్చనే మాట వినిపిస్తోంది. అన్ని కరెక్ట్ గా సెట్ అయితే పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు కూడా 2025లోనే థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉండొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.