వీరమల్లు టీంకి పవన్ ఏం చెప్పినట్లు?
ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ సెట్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు నెలలు గడుస్తోంది.
By: Tupaki Desk | 22 Aug 2024 10:30 AM GMTఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ సెట్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు నెలలు గడుస్తోంది. ఇంతకాలం రాజకీయం..ప్రభుత్వం పనుల్లోనే పీకే బిజీ అయ్యారు. దీంతో మరికొద్ది రోజుల్లో బ్యాక్ టూ షూట్ అంటూ సెట్స్ కి రాబోతున్నారు. ఇప్పటికే `ఓజీ` కోసం కొన్ని డేట్లు కేటాయించారు. పవన్ గ్యాప్ తీసుకోకుండా కొన్ని రోజుల పాటు షూట్ కి హాజరైతే చిత్రీకరణ పూర్తవుతుంది. అటుపై `ఓజీ` టీమ్ మిగతా పనుల్లో నిమగ్నమవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా సమయం ఎక్కువగానే పడుతుంది. ఆ పనుల్ని బట్టి రిలీజ్ కి ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే `ఉస్తాద్ భగత్ సింగ్` టీమ్ కూడా పీకేని కలిసింది. కొన్ని నెలలుగా పీకేకి దూరంగా ఉన్న టీమ్ పవన్ డేట్లు గురించి చర్చించినట్లు సమాచారం. ఇదే సమయంలో పవన్ అంతకంటే ముందు `హరి హర వీరమల్లు `పూర్తి చేయాలి అన్న సంగతి ఆ టీమ్ వద్ద ప్రస్తావిం చినట్లు తెలిసింది.
సరిగ్గా ఇదే సమయంలో వీరమల్లు టీమ్ కూడా పవన్ ని కలిసింది. జ్యోతికృష్ణ, ఏ.ఎం రత్నం, నిర్మాత దయాకరరావు, కెమెరా మెన్ మనోజ్ పరమహంస కలిసారు. అనంతరం డేట్లు గురించి అడిగినట్లు సమాచారం. `ఓజీ`తో పాటు వీరమల్లు కి కూడా డేట్లు కేటాయించాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు పవన్ కూడా సానుకూలంగానే స్పందించారుట. మరి డేట్లు ఎప్పటి నుంచి ఇచ్చారు? అన్నది తెలియాల్సి ఉంది. `వీరమల్లు` ఓజీ కంటే ముందుగానే ప్రారంభమైన సంగతి తెలిసిందే.
కానీ పెద్ద ప్రాజెక్ట్ కావడం..రిలీజ్ కి ఎ క్కువ సమయం పడుతుందని భావించి సుజిత్ తో `ఓజీ`ని పట్టాలె క్కించారు. ఆ తర్వాత రాజకీయంగా సమీకరణాలు మారడంతో ఎన్నికలకు ముందు ఏ సినిమా రిలీజ్ చేయలేకపోయారు.