Begin typing your search above and press return to search.

పవన్ భార్యతో గారాల కూతురు.. కాబోయే హీరో - సో క్యూట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Jun 2024 10:28 AM GMT
పవన్ భార్యతో గారాల కూతురు.. కాబోయే హీరో - సో క్యూట్!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ వెలుపల ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు వింటూ కొన్ని అక్కడికక్కడే క్లియర్ చేస్తున్నారు. మరికొన్ని వెంటనే సాల్వ్ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు. పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అని నిరూపించుకుంటున్నారు.


దీంతో పవన్.. ప్రజా దర్బార్ కు సంబంధించిన పిక్స్, పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ పనితనాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో నెట్టింట పవన్ ఫ్యామిలీ పిక్ ఒక్కసారిగా మెరిసింది. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్.. తన భార్య అన్నా లెజినోవా, పిల్లలు అకీరా నందన్, ఆద్యతో కలిసి ఉన్నారు. జనసేన పార్టీ పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతోంది. పవన్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

అయితే ఆ పిక్ వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉందండోయ్. జూన్ 12వ తేదీన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ వేడుక అయ్యాక ఫ్యామిలీతో కలిసి పవన్ తన ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో భారీ ట్రాఫిక్ వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి అంతా కాస్త సేద తీరారు. అప్పుడు ఫోటోకు పోజిచ్చారని జనసేన పార్టీ చెప్పింది.

ఇక ఈ పిక్ పై సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ వేరే లెవెల్ లో స్పందిస్తున్నారు. పిక్ ను తెగ రీ షేర్ చేస్తున్నారు. క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పచ్చని చెట్టు నీడలో ఫ్యామిలీతో పవన్ అన్న అంటూ పోస్ట్ చేస్తున్నారు. పిక్ లేటుగా బయటకు వచ్చినా లేటెస్ట్ గా ఉందని చెబుతున్నారు. అన్నా మేడం చీరలో తెలుగింటి ఆడపడుచులా ఉన్నారని, అకిరా పంచెకట్టులో సూపర్ ఉన్నాడని అంటున్నారు. ఆద్య కూడా చక్కగా చుడిదార్ లో ఉందని చెబుతున్నారు.

అయితే అకిరా నందన్, ఆద్య తమ తల్లి రేణు దేశాయ్ వద్ద ఉంటున్న విషయం తెలిసిందే. పవన్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పిల్లల బాధ్యత తీసుకున్నారు. అకిరా, ఆద్య మెగా ఇంట జరిగే అన్ని వేడుకలకు కూడా హాజరవుతుంటారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక పవన్ తో కనిపించిన అకిరా.. ఆ తర్వాత తండ్రి వెంటే ఢిల్లీ కూడా వెళ్లాడు. అనంతరం చిరు ఇంట్లోని వేడుకల్లో పాల్గొన్నాడు. అలా అకిరా నెట్టింట ట్రెండింగ్ లోనే ఉంటున్నాడు.