Begin typing your search above and press return to search.

పవన్ రెండు సినిమాల మధ్య పోటీ.. ఇది అసలు ఊహించలేదే..?

హరి హర వీరమల్లు సినిమా దాదాపు నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉంది కానీ ఇంకా ఆ సినిమా పూర్తి కాలేదు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 4:04 AM GMT
పవన్ రెండు సినిమాల మధ్య పోటీ.. ఇది అసలు ఊహించలేదే..?
X

పాలిటిక్స్ లో తను అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఐతే ఓ పక్క పవన్ తో సినిమా చేస్తున్న దర్శక నిర్మాతలు ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు. సెట్స్ మీద పవన్ కళ్యాణ్ వి 3 సినిమాలు ఉన్నాయి. వాటిలో ఏది ముందు ఏది వెనుక అన్నది చెప్పడం కష్టం. హరి హర వీరమల్లు సినిమా దాదాపు నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉంది కానీ ఇంకా ఆ సినిమా పూర్తి కాలేదు.

పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో ఓజీ సినిమా కూడా తెరకెక్కుతుంది. ఈ సినిమాను కూడా పూర్తి చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓజె, హరి హర వీరమల్లు ఈ రెండు సినిమాలు ముందు మేమంటే మేమని అనుకుంటున్నారు. పవన్ తనకు ఉన్న టైం ను ప్రస్తుతానికి కమిటైన ఈ సినిమాలను పూర్తి చేసి కొన్నాళ్లు పూర్తిగా రాజకీయాల మీదే దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యాడు.

పవన్ ఓజీ సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే ఇప్పుడు అనుకున్న డేట్ కి సినిమా రిలీజ్ అవ్వడం కష్టమని భావించి ఆ డేట్ ను ఎన్.టి.ఆర్ దేవరకి ఇచ్చేశారు. మరి పవన్ ఓజీ రిలీజ్ ఎప్పుడు.. హరి హర వీరమల్లు సినిమాను రిలీజ్ ఎప్పుడు చేస్తారని పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ మొదలైంది.

సుజిత్ ఓజీ నే ముందు రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న హడావిడికి ఓజీ వస్తే మాత్రం రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు. సుజిత్ కూడా ఈ సినిమాను నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో తెరకెక్కించాడని తెలుస్తుంది. పవన్ ఓజీ నవంబర్, డిసెంబర్ ఎప్పుడైనా రావొచ్చని చెబుతున్నారు. ఇక హరి హర వీరమల్లుని మాత్రం కుదిరితే 2025 సంక్రాంతికి లేదా సమ్మర్ కి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మాత్రం చిన్నగా పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.