పింక్ డ్రస్ లో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..!
లేటెస్ట్ గా అమ్మడు పింక్ డ్రస్ లో థై షోతో పిచ్చెక్కించేలా చేస్తుంది.
By: Tupaki Desk | 28 Jan 2025 4:32 AM GMTఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ దాదాపు ఒక పది సినిమాలు చేస్తే వచ్చే క్రేజ్ ని మొదటి సినిమాతోనే తెచ్చుకుంది. ఆరెక్స్ 100 తో టాలీవుడ్ ఆడియన్స్ కు డ్రీం గర్ల్ గా మారిన పాయల్ ఆ నెక్స్ట్ సినిమాల సెలక్షన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల కెరీర్ లో కాస్త వెనకపడ్డది. ఆరెక్స్ 100 సినిమా చేయడంతో అలాంటి పాత్రలే వస్తున్నాయని ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది అమ్మడు. ఐతే వచ్చిన సినిమాల్లో ఏది తన కెరీర్ కు హెల్ప్ అవుతుంది అన్నది ఎంపిక చేయడంలో కాస్త తప్పులు తడకలుగా నడిచింది.
అందుకే అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలు ఉండట్లేదు. ఆరెక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితోనే మంగళవారం అంటూ సినిమా చేసిన పాయల్ ఆ తర్వాత రక్షణ అనే సినిమా వచ్చినా లాభం లేకుండా పోయింది. తెలుగులో కెరీర్ మందగించింది కదా అని అమ్మడు కోలీవుడ్ వైపు వెళ్లింది. ప్రస్తుతం అమ్మడు అక్కడ గోల్ మాల్, ఏంజెల్ అనే సినిమాలు చేస్తుంది. తెలుగులో ఆది సాయి కుమార్ తో కిరాతక సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది.
ఐతే కంటిన్యూగా సినిమాలు ఉండవేమో కానీ తన ఫాలోవర్స్ ని ఆకట్టుకునేందుకు కంటిన్యూగా పాయల్ తన ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు పింక్ డ్రస్ లో థై షోతో పిచ్చెక్కించేలా చేస్తుంది. జిగేల్ జిగేల్ అనిపించే లైట్ పింక్ కలర్ డ్రెస్.. తన ఓర చూపుతోనే హృదయాలను కొల్లగొట్టేలా పాయల్ చేస్తున్న మ్యాజిక్ అంతా ఇంతా కాదు.
అలా చూస్తూ ఉండిపోవాలనిపిచేలా అందం ఆమె సొంతం. అందుకే సినిమాలు ఉన్నా లేకపోయినా తన సోషల్ మీడియా క్రేజ్ తో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది అమ్మడు. లేటెస్ట్ ఫోటో షూట్స్ కూడా ఇలా షేర్ చేసిందో లేదో అలా వైరల్ గా మారాయి. పాయల్ కెరీర్ లో మరో ఆరెక్స్ 100 సినిమా లాంటిది ఒకటి పడితే తిరిగి ఫాంలోకి రావాలని చూస్తుంది. సినిమాలతో పాటు ఫోటో షూట్స్ తో కూడా ఏమాత్రం తగ్గకుండా చేస్తూ వస్తుంది అమ్మడు. ఈ ఫోటో షూట్స్ చూసైనా సరే అందాల ముద్దుగుమ్మకి అవకాశాలు వచ్చేస్తాయని చెప్పొచ్చు.