పాయల్ టవల్ వీడియో వైరల్... ఇవేం కష్టాలు!
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పూత్.
By: Tupaki Desk | 21 March 2025 11:03 AM ISTఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పూత్. అంతకు ముందు నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి. కానీ ఆర్‌ఎక్స్ 100 సినిమాలో చేసిన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు మంచి స్పందన దక్కింది. నటిగానే కాకుండా తన అందంతోనూ అలరించింది. సాధారణంగా ఒకే సినిమాలో అందంతోనూ, నటనతోనూ ప్రతిభ చూపించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఆర్‌ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పూత్‌కి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా తెచ్చి పెట్టిన గుర్తింపుతో పాయల్ రాజ్‌పూత్ వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలను చేసింది. పలు సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్‌లోనూ నటించింది.
దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో కొనసాగుతున్న పాయల్ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు, వీడియోలతో వైరల్ కావడం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. కానీ ఈసారి పాయల్ ఒక వైరల్ వీడియోతో విమర్శలు ఎదుర్కొంటుంది. నెటిజన్స్ ఆ వీడియోను షేర్ చేస్తూ ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన పాయల్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి కష్టాలు ఇలా ఉంటాయి అంటూ తన బాధను చెప్పింది. అంత వరకు బాగానే ఉంది. కానీ ఆమె ఆ విషయాన్ని చెప్పినప్పుడు టవల్ కట్టుకుని ఉంది. సాధారణంగా సినిమాల్లో టవల్ కట్టుకుని సీన్స్‌లో కనిపిస్తూ ఉంటారు. కానీ సోషల్ మీడియాలోనూ ఇలాంటి వీడియోలను షేర్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు పాయల్‌ను విమర్శిస్తూ కామెంట్ చేస్తున్నారు.
సినిమా వారి కష్టాలు చెప్పుకోవడం తప్పు లేదు. కానీ అందుకోసం టవల్ కట్టుకుని ఉన్నప్పుడు వీడియోను రికార్డ్ చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇవేం కష్టాలు, కేవలం పబ్లిసిటీ స్టంట్ అన్నట్లుగా మీ వీడియో ఉందంటూ కొందరు పాయల్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. మొత్తానికి పాయల్ రాజ్‌పూత్‌ను సోషల్ మీడియాలో టవల్ వీడియో కారణంగా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. పాపం పాయల్‌కి ఎంత కష్టం వచ్చింది అంటూ ఆ టవల్ వీడియోలను ట్రోల్ చేస్తూనే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హీరోయిన్స్ ఇలాంటి వీడియోలను షేర్ చేయడం ద్వారా పబ్లిసిటీ దక్కించుకోవాలని చూస్తున్నారు, కానీ అది ఏ మాత్రం సరైనది కాదని నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పాయల్ చివరగా మంగళవారం సినిమాతో సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఆ సినిమాలో పాయల్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. డీ గ్లామర్‌గా నటించి నటనతో మెప్పించింది. ప్రస్తుతం మంగళవారం సినిమా సీక్వెల్ రూపొందుతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే సీక్వెల్‌లో పాయల్ నటించడం లేదు. ఇప్పటి వరకు ఆ సీక్వెల్‌లో నటిస్తున్న హీరోయిన్ ఎవరు అనే విషయంలో క్లారిటీ రాలేదు. మంగళవారంలో పాయల్ తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం పాయల్ ఒక తెలుగు సినిమాతో పాటు ఇతర భాషల సినిమాల్లో నటించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యేక పాటలకు రెడీ అంటూ ఆ మధ్య ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. అంతే కాకుండా ఎలాంటి పాత్రల్లో అయినా నటించేందుకు పాయల్ రెడీ అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. మరికొంత కాలం పాయల్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగే అందం ఆమెది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు.