Begin typing your search above and press return to search.

చీరకట్టులో పాయల్.. వ్వాటే లుక్!

పాయల్ రాజ్‌పుత్ తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌తో ఎప్పటికప్పుడు అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   21 Nov 2024 2:45 AM GMT
చీరకట్టులో పాయల్.. వ్వాటే లుక్!
X

పాయల్ రాజ్‌పుత్ తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌తో ఎప్పటికప్పుడు అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఘాటైన గ్లామర్ తో ఆకట్టుకునే ఆమె ఈసారి చీరకట్టులో ఊహించని విధంగా దర్శనమిచ్చింది. అచ్చమైన తెలుగామ్మాయి తరహాలో పాయల్ చందమామలా మెరిసిపోతోంది. పర్పుల్ కలర్ చీర, ట్రెడిషనల్ జువెలరీలో ఆమె అందం మరింత హైలైట్ అవుతోంది. ఫోటోల్లో ఆమె స్మైల్, గ్లామర్ అన్నీ కలగలిపి ఒక అందమైన బుట్టబొమ్మలా కనిపిస్తోంది.

ఇక పాయల్ రాజ్‌పుత్ తన కెరీర్‌ను పంజాబీ సినిమా 'చన్నా మేరియా'తో ప్రారంభించింది. కానీ 'RX 100' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాలో ఆమె పోషించిన బోల్డ్ క్యారెక్టర్ ఆమెను నేరుగా టాప్ లిస్టులో చేరేలా చేసింది. తరువాత ఆమె పలు సినిమాల్లో నటించినప్పటికీ, 'ఆర్ఎక్స్ 100'లాంటి విజయం అందుకోలేకపోయింది. 'వెంకీమామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో పర్ఫార్మెన్స్‌తో మెప్పించినప్పటికీ, కమర్షియల్ బ్రేక్ మాత్రం రాలేదు.

ఇక మంగళవారం సినిమా మాత్రం మళ్ళీ కమర్షియల్ గా విజయాన్ని ఇచ్చింది. పాయల్ నిత్యం తన గ్లామర్ లుక్స్‌తో నెట్టింట రచ్చ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె పలు ఫోటోషూట్లను పోస్ట్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ లేటెస్ట్ ఫోటోల్లో ఆమె ట్రెడిషనల్ లుక్ అందరి హృదయాలను దోచేస్తోంది. పాయల్ చీరకట్టులో తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తుండటంతో నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం పాయల్ తనకు తగిన హిట్స్ కోసం ఎదురుచూస్తోంది. లేడీ ఓరియెంటెడ్ పాత్రలతో పాటు, మంచి కథలు ఎంచుకుని నటన పరంగా తనను నిరూపించుకోవాలని ఆమె ప్రయత్నిస్తోంది. ఆమె త్వరలోనే కొన్ని కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఒక తమిళ సినిమాతో బిజీగా ఉన్నట్లు టాక్. మరి ఆ సినిమా అమ్మడికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.