Begin typing your search above and press return to search.

కోర్టులో ప్ర‌శ్న‌లు భ‌రించ‌లేక‌.. అత్యాచార బాధితుల‌పై న‌టి వ్యాఖ్య‌

80శాతం మంది అత్యాచార బాధితులు త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం లేక‌, సంవ‌త్స‌రాల పాటు న్యాయం కోసం న్యాయ‌స్థానాల చుట్టూ తిర‌గ‌లేక‌

By:  Tupaki Desk   |   17 July 2024 2:30 PM GMT
కోర్టులో ప్ర‌శ్న‌లు భ‌రించ‌లేక‌.. అత్యాచార బాధితుల‌పై న‌టి వ్యాఖ్య‌
X

80శాతం మంది అత్యాచార బాధితులు త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం లేక‌, సంవ‌త్స‌రాల పాటు న్యాయం కోసం న్యాయ‌స్థానాల చుట్టూ తిర‌గ‌లేక‌, త‌మ స‌మ‌స్య‌ను బ‌య‌టికి చెప్పుకుంటే స‌మాజం నుంచి ఎదురయ్యే దుర‌వ‌స్త‌ల్ని భ‌రించ‌లేక ఆ విష‌యంలో బ‌య‌ట‌ప‌డ‌టం లేద‌ని అన్నారు న‌టి పాయ‌ల్ ఘోష్. బెంగాళీ న‌టి పాయ‌ల్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్ స‌ర‌స‌న ఊస‌ర‌వెల్లి, మంచు మ‌నోజ్ స‌ర‌స‌న ప్ర‌యాణం చిత్రాల‌లో న‌టించిన పాయ‌ల్ అటుపై బాలీవుడ్ కి మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. కానీ ఇప్పుడు అక్క‌డ కూడా కెరీర్ జీరో అయిపోయింది.

కొన్నేళ్లుగా అవ‌కాశాల్లేక ఇబ్బందుల్లో ఉంది. నాలుగేళ్ల క్రితం మీటూ ఉద్య‌మ స‌మ‌యంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ త‌న‌పై అత్యాచారం చేసాడ‌ని పాయ‌ల్ ఘోష్‌ తీవ్రంగా ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌టాన్ తో ఐదేళ్ల పాటు నిండా ప్రేమ‌లో మునిగాన‌ని, కానీ బ్రేక‌ప్ అయింద‌ని పాయ‌ల్ వెల్ల‌డించింది. గౌత‌మ్ గంబీర్ త‌న‌కు మెసేజ్ లు పంపేవాడ‌ని కూడా వెల్ల‌డించింది.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ త‌న‌ను రే* చేసిన విష‌యాన్ని ప్ర‌స్థావిస్తూ.. నిదుర మాత్ర‌లు మింగ‌నిదే కంటికి కునుకుప‌ట్ట‌నే ప‌ట్ట‌ద‌ని పాయ‌ల్ ఘోష్ ఇటీవ‌లి ఇన్ స్టా పోస్ట్ లో వెల్ల‌డించింది. ఇప్పుడు భార‌త‌దేశంలో అత్యాచార బాధితుల క‌ల‌త‌ల గురించి సోష‌ల్ మీడియాల్లో పాయ‌ల్ ప్ర‌స్థావించింది. భార‌త‌దేశంలో 80శాతం మంది అత్యాచార బాధితులు బ‌య‌ట‌కు చెప్పుకోక‌పోవ‌డానికి కార‌ణాల‌ను ప్ర‌స్థావిస్తూ న్యాయ‌వ్య‌వ‌స్థ మారాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను నొక్కి చెప్పింది.

అందుకు సంబంధించిన ఓ పేప‌ర్ క్లిప్పింగ్ ని కూడా పాయ‌ల్ ఘోష్ త‌న సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. బ‌య‌ట‌కు చెప్పుకున్నా త‌మ‌కు న్యాయం జ‌రుగుతుందో లేదో తెలీద‌ని న‌మ్మేవారు.. ఏళ్ల త‌ర‌బ‌డి వేచి చూడాల‌న్న భ‌యం ఉన్న‌వారు ఫిర్యాదు చేసేందుకు కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని పాయ‌ల్ న్యాయ వ్య‌వ‌స్థ‌పై ఆరోపించారు. అత్యాచార బాధితులు కోర్ట్ బోనులోకి వ‌చ్చాక అడిగే ఇబ్బందిక‌ర ప్ర‌శ్న‌ల గురించి తెలుసుకుని కూడా చాలామంది ఫిర్యాదు చేయ‌డం లేద‌ని కూడా ఇన్‌స్టా క్లిప్పింగ్ లో రాసి ఉంది. ప్ర‌స్తుత న్యాయం అత్యాచార బాధితుల కంటే అత్యాచారం చేసిన వారికే అండ‌గా ఉంద‌ని కూడా ఇందులో రాయ‌డం కొస‌మెరుపు. నాలుగేళ్ల క్రితం త‌న‌ను ప్ర‌ముఖు ద‌ర్శ‌కుడు అనురాగ్ అత్యాచారం చేసాడ‌ని ఆరోపించిన పాయ‌ల్ కి ఇటీవ‌ల అవాకాశాల్లేవ్.

బాలీవుడ్‌లో ప్రారంభ రోజుల్లో ఇబ్బంది..

అత్యాచారం జ‌రిగిన త‌ర్వాత నేను కూడా మొదట్లో చెప్పలేకపోయాను.. నా కుటుంబం పరిణామాలను ఎదుర్కొంటుందని భావించాన‌ని కూడా పాయ‌ల్ త‌న ఇన్ స్టా పోస్ట్ లో రాసారు. ''నేను #బాలీవుడ్‌కి కొత్త అనుకున్నాను.. నాకు ఎవరూ పని ఇవ్వరు.. నా కెరీర్ నాశనం అవుతుంది.. కానీ ఇకపై కాదు.. నేను ఎప్పుడూ దాని గురించి మాట్లాడుతాను. రాత్రి నన్ను తాకుతుంది...!! '' అని కూడా పాయ‌ల్ న‌ర్మ‌గ‌ర్భంగా సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేసింది.