Begin typing your search above and press return to search.

ప్రభాస్‌తో పెళ్లి.. హాట్ బ్యూటీ కామెంట్స్ వైరల్!

‘Rx 100’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన హాట్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌.. తొలి చిత్రంతోనే తెలుగు యువ హృదయాలను కొల్లగొట్టింది

By:  Tupaki Desk   |   5 Aug 2024 7:33 AM GMT
ప్రభాస్‌తో పెళ్లి.. హాట్ బ్యూటీ కామెంట్స్ వైరల్!
X

‘Rx 100’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన హాట్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌.. తొలి చిత్రంతోనే తెలుగు యువ హృదయాలను కొల్లగొట్టింది. తన అందచందాలతో వరుస అవకాశాలు అందుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫేవరెట్ హీరో అని అమ్మడు అనేక సందర్భాలలో చెప్పింది. అయితే ప్రభాస్ తో పాయల్ పెళ్ళి అయినట్లుగా ఆ మధ్య సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇదే విషయం మీద పాయల్ తాజాగా మాట్లాడింది.

69వ ఫిలింఫేర్‌ సౌత్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పాయల్‌ రాజ్‌ పుత్‌ కూడా సందడి చేసింది. ఈ సందర్భంగా "మీరు ఎవరితో కలిసి రెడ్ కార్పెట్ మీద నడవాలని అనుకుంటున్నారు?" అని అడగ్గా.. "ప్రభాస్ తో" అంటూ హార్ట్ సింబల్ చూపించింది పాయల్. అలానే "ఇప్పటివరకూ మీ గురించి వచ్చిన ఏ రూమర్‌ కు బాగా నవ్వుకున్నారు?" అనే ప్రశ్నకు స్పందిస్తూ.. "ప్రభాస్‌ తో నా పెళ్లైందంటూ రీసెంట్ గా వార్తలు వచ్చాయి. వాటిని చూసి బాగా నవ్వుకున్నాను" అని బదులిచ్చింది. అంతేకాదు వాటిని బాగా ఎంజాయ్ చేశానని, నిజమైతే బాగుండు అని సిగ్గు పడుతూ చెప్పింది.

పాయల్ రాజ్ పూత్ గతంలోనూ చాలా సార్లు ప్రభాస్ మీద తన ఇష్టాన్ని బయటపెట్టింది. ప్రభాస్ చాలా మంచి మనసున్న వ్యక్తి అని, ఆయనతో కలిసి వర్క్ చేయడం తన డ్రీమ్ అని మనసులోని కోరికను వెలిబుచ్చింది. డార్లింగ్ ఫ్యాన్స్ సైతం తనకు ఎంతో సపోర్ట్ గా ఉంటారని పలు వేదికల మీద వారికి థ్యాంక్స్ చెప్పింది. అప్పట్లో సైమా అవార్డుల కార్యక్రమంలోనూ ప్రభాస్ తో కలిసి రెడ్ కార్పెట్ పై నడవాలని ఉందని కామెంట్స్ చేసింది. ఇప్పుడు లేటెస్టుగా ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ ప్రదానోత్సవంలో మరోసారి ప్రభాస్ మీదున్న తన అభిమానాన్ని చాటుకుంది.

"ఇప్పటివరకూ ఐఫా, సైమా వంటి ఎన్నో అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కానీ ఫిలింఫేర్‌ కు హాజరు కావడం ఇదే ఫస్ట్ టైమ్. సినిమాను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫామ్‌. వివిధ భాషలకు చెందిన నటీనటులను ఇక్కడ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది" అని పాయల్ రాజ్ పూత్ తెలిపింది. కరీనా కపూర్ తన ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పింది. లైఫ్ ని వేరే యాక్టర్స్ తో ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవాలనుకుంటే, ఎవరిని ఎంచుకుంటారు? అని అడగ్గా.. అలాంటి ఉద్దేశం లేదని, ప్రస్తుతం తన జీవితం ఎంతో హ్యాపీగా ఉందని తెలిపింది. నా చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తున్నా. వాళ్లు నాపై చూపించే ప్రేమాభిమానాల వల్ల జీవితం మరింత అందంగా మారిందని పాయల్ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ లో నెగిటివ్ అండ్ బోల్డ్ క్యారక్టర్ లో మెప్పించిన పాయల్‌ రాజ్‌పుత్‌.. వెంకీమామ, RDX లవ్‌, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, జిన్నా వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. మంగళవారం సినిమాతో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘గోల్‌ మాల్‌’, ‘ఏంజెల్‌’, ‘కిరాతక’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఆమె చివరగా నటించిన ‘రక్షణ’ మూవీ నిరాశ పరిచింది.