పెళ్లి అయిన వాళ్లూ ఇంకా వెతుకుతూనే ఉన్నారు : పాయల్
అయితే ఈసారి హాట్ ఫోటో ల వల్ల కాకుండా ఆమె చేసిన కామెంట్ వల్ల వార్తల్లో నిలిచింది.
By: Tupaki Desk | 8 Aug 2023 1:30 PM GMTఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. ఆ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో కనిపించడం ద్వారా మంచి పేరును సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది.
సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ ఫోటో లు షేర్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అంతే కాకుండా తన ప్రియుడితో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ ట్రెండ్డింగ్ లో నిలుస్తూ ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి హాట్ ఫోటో ల వల్ల కాకుండా ఆమె చేసిన కామెంట్ వల్ల వార్తల్లో నిలిచింది.
ఇన్‌స్టాగ్రామ్ లో పాయల్... నీకు ఇంకా సోల్ మేట్ కనిపించలేదని బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే పెళ్లి అయిన వాళ్లు కూడా ఇంకా వారి సోల్ మేట్ కోసం వెతుక్కుంటూనే ఉన్నారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు షేర్ చేసింది.
పెళ్లి అయిన వారు తమ సోల్ మేట్స్ కోసం వెతుక్కుంటున్న కారణంగా విడాకులు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారా అంటూ కొందరు పాయల్ పోస్ట్ కి కామెంట్స్ చేస్తున్నారు.
పాయల్ రాజ్ పూత్ కామెంట్స్ భారతీయ పెళ్లి వ్యవస్థను అవమానించినట్లుగా ఉన్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకి పెళ్లి పై ఆసక్తి లేకుంటే.. పెళ్లి వ్యవస్థపై నమ్మకం లేకుంటే సోలోగా ఉండవచ్చు.
కానీ ఇతరుల మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడటం సరి కాదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజా వివాదం పై పాయల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.