Begin typing your search above and press return to search.

ఈ బ్యూటీ పని అయిపోయినట్లేనా..?

బాలీవుడ్ లో సీరియల్స్ లో నటించి ఆ క్రేజ్ తో సౌత్ లో ఛాన్స్ అందుకున్న హీరోయిన్స్ లిస్ట్ లో పాయల్ రాజ్ పుత్ కూడా ఉంది

By:  Tupaki Desk   |   13 July 2024 1:30 PM GMT
ఈ బ్యూటీ పని అయిపోయినట్లేనా..?
X

బాలీవుడ్ లో సీరియల్స్ లో నటించి ఆ క్రేజ్ తో సౌత్ లో ఛాన్స్ అందుకున్న హీరోయిన్స్ లిస్ట్ లో పాయల్ రాజ్ పుత్ కూడా ఉంది. అక్కడ సీరియల్స్ లో నటించిన ఆమెను చూసిన అజయ్ భూపతి RX 100 లో తను రాసుకున్న హీరోయిన్ పాత్రకు పర్ఫెక్ట్ అనుకున్నాడు. వెంటనే ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాడు. కార్తికేయతో పాయల్ చేసిన RX 100 సూపర్ హిట్ అయ్యింది. సినిమాలో పాత్రకు పాయల్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది.

ఆ సినిమా హిట్ తో పాయల్ కు వరుస అవకాశాలు వచ్చాయి. ఐతే అన్ని కూడా RX 100 తరహా కథలే వస్తున్నాయని అమ్మడు బాధపడింది. ఐతే ఎలాగోలా సినిమాలు చేస్తూ వచ్చిన అమ్మడికి వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ఐతే ఆ సినిమాల ఫలితాలు తేడా కొట్టడంతో అమ్మడి కెరీర్ రిస్క్ లో పడింది. లాస్ట్ ఇయర్ మాయా పేటిక సినిమాతో వచ్చిన పాయల్ ఆ తర్వాత ఆరెక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన మంగళవారం లో కూడా నటించింది.

మంగళవారం కమర్షియల్ గా ఒక రేంజ్ లో ఆడకపోయినా పాయల్ కి మళ్లీ కొంత బూస్టింగ్ ఇస్తుందని అనుకున్నారు. ఆ సినిమాలో పాయల్ తన నటనతో ఆకట్టుకుంది. తనలో ఉన్న టాలెంట్ ని కేవలం అజయ్ భూపతి మాత్రమే చూడగలుగుతున్నాడు అన్నట్టుగా మంగళవారం లో అమ్మడి యాక్టింగ్ ఉంది. ఐతే ఆ సినిమా తర్వాత అయినా పాయల్ ఫేట్ మారుతుందని అనుకోగా తెలుగులో మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుంది.

ఐతే ఇలా కాదనుకున్న పాయల్ చిన్నగా కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ గోల్ మాల్, ఏంజెల్ సినిమాల్లో నటించింది. పాయల్ నుంచి ఈమధ్యనే తెలుగులో వచ్చిన రక్షణ సినిమాను కూడా ఎవరు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆది సాయి కుమార్ తో ఒక సినిమా చేస్తుంది పాయల్. మరి ఆ సినిమా అయినా అమ్మడికి తెలుగులో మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. ఎలాంటి పాత్ర ఇచ్చినా చేసేందుకు రెడీ అనేస్తున్న పాయల్ ని కేవలం గ్లామర్ సైడ్ మాత్రమే కాకుండా వెరైటీ రోల్స్ చేయిస్తే బెటర్ అని చెప్పొచ్చు. సినిమాల్లో కాకపోయినా అమ్మడు తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ కు కావాల్సినంత గ్లామర్ స్టఫ్ అందిస్తుంది. అందుకే ఒక్కసారి పాయల్ ని ఫాలో అవ్వడం మొదలు పెడితే అమ్మడి మాయలో తడిసి ముద్ద అవ్వాల్సిందే అని చెప్పుకుంటున్నారు ఆడియన్స్.