బ్లాక్‌లో పాయల్ స్టన్నింగ్ లుక్ వైరల్
పాయల్ ఇంతలోనే మరో కొత్త ఫోటోషూట్ తో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి బ్లాక్ లుక్ లో ప్రత్యక్షమై ఫ్యాన్స్ గుండెల్లో గుబులు రేపింది.
By: Tupaki Desk | 12 Oct 2023 4:18 PM GMTఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరించింది. త్వరలోనే పాయల్ నటించిన మంగళవారం రిలీజ్ కి రానుంది. మరోవైపు పాయల్ వరుస విహార యాత్రలకు సంబంధించిన ఫోటోషూట్లు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోషూట్లలో ఆకర్షణీయమైన ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తోంది పాయల్. ఇటీవల లేహ్ లడఖ్(హిమచల్ ప్రదేశ్)లోని ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాల నడుమ ఆకర్షణీయమైన విహారయాత్రను కొనసాగించింది.
ఆర్.ఎక్స్ 100 బ్యూటీ మంచు కొండల్లో తనవైన సాహసాలతో ఆకర్షించింది. పాయల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అద్భుతమైన స్నాప్‌షాట్‌లను షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలను అన్వేషించడం వల్ల కలిగే నిజమైన ఆనందం పాయల్ కళ్లలో కనిపించింది. పాయల్ ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో గాడిదపై స్వారీ చేస్తూ ఆనందించడం కూడా కనిపించింది.
పాయల్ ఇంతలోనే మరో కొత్త ఫోటోషూట్ తో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి బ్లాక్ లుక్ లో ప్రత్యక్షమై ఫ్యాన్స్ గుండెల్లో గుబులు రేపింది. నలుపు రంగు తనకు అద్భుతంగా సూటవుతుందని పాయల్ క్యాప్షన్ లో పేర్కొంది. ఇక బ్లాక్ కలర్ థై స్లిట్ ఫ్రాక్ లో పాయల్ అందచందాలకు మతి చెడాల్సిందే. అలా నవ్వులు చిందిస్తూ, స్టైలిష్ గా ఫోజ్ కొడుతూ పాయల్ ఈ ఫోటోషూట్ లో చాలా ఆస్వాధించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే..వినోద పరిశ్రమలో పాయల్ రాజ్‌పుత్ ప్రయాణం సుదీర్ఘమైనది. 2010లో హిందీ టెలివిజన్ సిరీస్ 'సప్నోన్ సే భరే నైనా'తో నటిగా కెరీర్ ప్రారంభమైంది. అటుపై పంజాబీ చిత్రసీమలోను పాపులైంది. 2018లో RX 100లో ఆమె తెలుగు సినిమా అరంగేట్రం పాయల్ కి స్టార్‌డమ్‌కి తీసుకువచ్చింది. ఈ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు ఉత్తమ మహిళా అరంగేట్ర (తెలుగు) నటిగా SIIMA అవార్డును గెలుచుకుంది. వెంకీ మామా (2019), షావా నీ గిర్ధారి లాల్ (2021- పంజాబీ), హెడ్ బుష్ (2022) వంటి చిత్రాల్లో నటించింది.
తదుపరి చిత్రం మంగళవరం లైఫ్ డ్రామా నేపథ్యంలోని సినిమా. ఆర్.ఎక్స్ 100తో తనని తెలుగు తెరకు పరిచయం చేసిన అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జులైలో మంగళవరం టీజర్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ చిత్రం గణనీయమైన అంచనాలను పెంచింది.