Begin typing your search above and press return to search.

పాయ‌ల్ స్ట‌న్నింగ్ డ్యాన్స్ మూవ్స్ వైరల్

ప్ర‌స్తుతం వ‌రుస‌ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఆన్ లొకేష‌న్ డ్యాన్సులు చేస్తున్న ఓ వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది.

By:  Tupaki Desk   |   23 July 2024 7:27 AM GMT
పాయ‌ల్ స్ట‌న్నింగ్ డ్యాన్స్ మూవ్స్ వైరల్
X

పాయ‌ల్ రాజ్ పుత్ చివ‌రి సారిగా ఓ వివాదం కార‌ణంగా హెడ్ లైన్స్ లోకొచ్చింది. ర‌క్ష‌ణ మేక‌ర్స్ తో త‌న వివాదం గురించి బ‌హిరంగంగా వెల్ల‌డించింది.. ఆ వివాదం త‌ర్వాత పాయ‌ల్ త‌న ప‌నిలో తాను ఉంది. ప్ర‌స్తుతం వ‌రుస‌ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఆన్ లొకేష‌న్ డ్యాన్సులు చేస్తున్న ఓ వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది.

పాయ‌ల్ అద్భుత‌మైన మూవ్స్ తో ఆక‌ట్టుకున్న ఈ వీడియోని త‌న అధికారిక‌ ఇన్ స్టాలో స్వ‌యంగా షేర్ చేసింది. ''తీసిన ప్రతి ఒక్క షాట్ వెనుక అంకితభావం, కృషి ఉంటుంది'' అని పాయ‌ల్ దీనికి క్యాప్ష‌న్ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్ల‌తో పాటు పాయ‌ల్ స్టెప్పులు ఆక‌ట్టుకుంటున్నాయి. ది బెస్ట్ మూవ్స్ తో దోచుకుంది! అంటూ అభిమానులు దీనికి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

నిజ‌మే పాయ‌ల్ క్యాప్ష‌న్ ప్ర‌కారం.. త‌న‌లో ఉన్న డెడికేష‌న్ ని క్యాచ్ చేసాడు కాబ‌ట్టే అజ‌య్ భూప‌తి ఆర్ఎక్స్ 100 లాంటి గొప్ప అవ‌కాశాన్ని త‌న‌కు ఇచ్చారు. ఆ సినిమా విజ‌యం అంద‌రి జీవితాల‌ను ప్ర‌భావితం చేసింది. అజ‌య్ స‌హా పాయ‌ల్ వ‌రుస‌గా సినిమాల‌తో బిజీ అయ్యారు. హీరో కార్తికేయ స్టార్ డ‌మ్ పెంచుకోవ‌డానికి ఈ తొలి అడుగు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డింది. ప్ర‌స్తుతం వారంతా ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు. అజ‌య్ భూప‌తికి ఇటీవ‌ల హిట్లు లేవు. కెరీర్ బండిని నెమ్మ‌దిగా ముందుకు సాగిస్తున్నాడు. మ‌రోవైపు పాయ‌ల్ గోల్ మాల్- ఏంజెల్-కిరాత‌క అనే మూడు సినిమాల్లో పాయ‌ల్ న‌టిస్తోంది.