సోఫీ టర్నర్ విడాకుల వెనక పీసీ పేరు?
ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ సోదరుడు జో జోనాస్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
By: Tupaki Desk | 2 Oct 2023 2:45 AM GMTప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ సోదరుడు జో జోనాస్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల గాయని సోఫీ టర్నర్ - జో జోనాస్ విడాకుల వార్తలు ఇంటర్నెట్లో దావానంలా వ్యాపించాయి. అప్పటి నుండి వారి బ్రేకప్ కి కారణమైన విభేధాల గురించి రకరకాలుగా ఊహాగానాలు సాగుతున్నాయి. సోఫీ- జో విడాకుల వెనుక తాజా పుకారు వేడెక్కిస్తోంది. ఆ ఇద్దరి మధ్యా విభేధాలకు ప్రియాంక చోప్రా ఒక కారణం అంటూ ప్రచారం సాగడం ఇప్పుడు నెటిజనుల్లో చర్చకు తావిస్తోంది.
కాస్మోపాలిటన్లోని ఓ కథనం ప్రకారం.. నిక్ జోనాస్ భార్యామణి అయిన ప్రియాంక చోప్రాతో నిరంతర పోలికలు సోఫీని విపరీతమైన ఒత్తిడికి గురిచేశాయని, ఇతరులతో పోలిక చూపెట్టడం తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని సదరు పోర్టల్ పేర్కొంది. జోనాస్ భార్యామణుల మధ్య పోలిక చూడటం సోఫీకి చాలా ఇర్రిటేషన్ పుట్టించిందట. జోనాస్ - సోఫీ జంట నిక్ - ప్రియాంక చోప్రాలా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని, బాగా స్థిరపడాలని పోలిక చెప్పడం సోఫీకి నచ్చేది కాదని కూడా సదరు పోర్టల్ కథనం పేర్కొంది.
కుటుంబంలో ఆ ఇద్దరి మీదా అధిక ఒత్తిడి సమస్యాత్మకంగా మారిందన్నది సదరు కథనం వెల్లడించింది. వాళ్లలా ఎదగాలని కోరడం మొదట్లో సోఫీకి పెద్ద సమస్యగా లేదు. కానీ కాలక్రమంలో అన్యోన్య దాంపత్యం విషయంలో పోలిక చూడటం ఇర్రిటేట్ చేసిందట. అయితే సోఫీ తన వయస్సు 27 ఏళ్లు మాత్రమేనని, తనకు ఇతరులకు ఉన్న అనుభవాలు లేవని భావించిందని కూడా ఈ కథనంలో పేర్కొన్నారు. తాను చిన్న వయస్సులో బాల్యం అంతా పని చేస్తూ గడిపింది. కాబట్టి ఆ ఒత్తిళ్లను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. కానీ ఈ నిర్ణయం విషయంలో కూడా కుటుంబంలో విభేధాలు తలెత్తాయని తెలిసింది.
మరో కథనంలో సోఫీ- జోజోనాస్ జంట అప్పటికే ఒక సొంత ఇల్లు కొనుక్కునే ప్లాన్ లో ఉన్నారు. కానీ ఇంతలోనే బంధం బ్రేకప్ అయిందని కూడా వెల్లడించారు.