ఇంట్రెస్టింగ్ 'పెద్ది'.. బ్రూస్లీలా జంప్!
తాజాగా వారందర్ని సర్ ప్రైజ్ చేస్తూ 'పెద్ది' గ్లింప్స్ తేదీని ఫైనల్ చేసింది.
By: Tupaki Desk | 30 March 2025 12:34 PMమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని మార్చి 27 ఆర్సీ 16 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తొలి పోస్టర్ తోనే కటౌట్ ఎలా ఉంటుందన్నది అర్దమైంది. రగ్డ్ లుక్ లో చరణ్ మరోసారి అలరిస్తున్నాడని తేలిపోయింది. రంగస్థలం తర్వాత అలాంటి పాత్రకు సమీపంగా ఈ పాత్ర ఉంటుందా? అన్న సందేహం వ్యక్తమైంది. అదే రోజు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు.
కానీ పని పూర్తి కాకపోవడంతో రిలీజ్ సాధ్యపడలేదు. దీంతో ఆ గ్లింప్స్ ఎప్పుడెప్పుడా? అంటూ మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వారందర్ని సర్ ప్రైజ్ చేస్తూ 'పెద్ది' గ్లింప్స్ తేదీని ఫైనల్ చేసింది. ఉగాదిని పురస్కరించుకుని 'పెద్ది' టీమ్ అభిమానులకు సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. శ్రీరామ నవి సందర్భంగా ఏప్రిల్ 6న గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఓ కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.
ఇందులో రామ్ చరణ్ బ్రూస్లీ లుక్ లో కనిపిస్తున్నాడు. గాల్లోకి ఎగురుతూ జంప్ చేస్తోన్న ఫోజ్ ఇది. గతంలో బ్రూస్లీ సినిమాలో కూడా ఇలాంటి జంపింగ్ ఫోజులు చాలానే వచ్చాయి. బాడీ లుక్ పరంగానూ ఇందులో చరణ్ స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. తొలి పోస్టర్ లో కాస్త వైల్డ్ గా ఉన్నా? ఈ పోస్టర్ లో మాత్రం స్లిమ్ గా కనిపిస్తున్నాడు. దీంతో గ్లింప్స్ పై ఎగ్జైట్ మెంట్ పెరిగిపోతుంది. చరణ్ ఎలా కనిపిస్తాడు? రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది? అని ఒకటే ఎగ్జైట్ మెంట్ కనిపిస్తుంది. వీటన్నింటికి నవమి రోజున తెర పడుతుంది.
ఇందులో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్- సుకుమార్ రైటింగ్స్- వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.