Begin typing your search above and press return to search.

'పేకమేడలు'.. రూ.50 కే మూవీ ప్రీమియర్ టికెట్

రూ.150 విలువ చేసి టికెట్ ను కేవలం రూ.50 కే విక్రయించనున్నారు. ముప్పై శాతం అసలు రేటుకు ఏసీలో మల్టీప్లెక్సుల్లో సినిమాను చూపించనున్నారు.

By:  Tupaki Desk   |   15 July 2024 2:42 PM GMT
పేకమేడలు.. రూ.50 కే మూవీ ప్రీమియర్ టికెట్
X

కోలీవుడ్ డబ్బింగ్ మూవీస్ నా పేరు శివ, అంధగారంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు నటుడు వినోద్ కిషన్. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆయన మెప్పించారు. ఇప్పుడు హీరోగా స్ట్రెయిట్ తెలుగు మూవీ పేకమేడలు చేస్తున్న విషయం తెలిసిందే. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే పేకమేడలు మూవీ నుంచి మేకర్స్ రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ట్రైలర్ బట్టి చూస్తుంటే.. ఈ సినిమా కామెడీ కమ్ ఎమోషనల్ స్టోరీతో ఉండనుందని తెలుస్తోంది. అయితే జులై 19వ తేదీన మూవీ రిలీజ్ చేయనున్న నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే ప్లాన్ వేశారు. తమదైన స్ట్రాటజీని తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో పేకమేడలు ప్రీమియర్ షోస్ వేయనున్నారు.

వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ సహా పలు నగరాల్లో ప్రీమియర్ షోస్ ను ప్రదర్శించనున్నారు మేకర్స్. అందులో స్పెషల్ స్ట్రాటజీ ఏముందని అనుకుంటున్నారా? రూ.150 విలువ చేసి టికెట్ ను కేవలం రూ.50 కే విక్రయించనున్నారు. ముప్పై శాతం అసలు రేటుకు ఏసీలో మల్టీప్లెక్సుల్లో సినిమాను చూపించనున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్ట్రాటజీ అని నెటిజన్లు చెబుతున్నారు.

ఎందుకంటే ఇలాంటి ఆఫర్లకు సినీ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం ఖాయం. తక్కువ కాస్ట్ కే సినిమా టికెట్ అంటే కచ్చితంగా మూవీ ఓ సారి చూద్దామని అనుకుంటారు. అలా థియేటర్లకు వెళ్తారు. ఒకవేళ కంటెంట్ క్లిక్ అయితే చాలు.. పాజిటివ్ మౌత్ టాక్ పక్కాగా వస్తుంది. అలా మూవీ భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి చిన్న సినిమాల నిర్మాతలు ఇలా అప్పుడప్పుడు చేస్తుండాలి. అప్పుడే మంచి లాభం ఉంటుంది.

ట్రైలర్ ప్రకారం.. ఏ పని లేకుండా జీవితంలో పగటి కలలు కంటూ భార్య సంపాదన మీద బతికే ఓ వ్యక్తి.. ఒక జాబ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ ఒక అమ్మాయి పరిచయమైతే అతని లైఫ్ ఎలా మారింది? భార్యా భర్తల మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమాగా తెలుస్తోంది. ఇప్పుడు మేకర్స్.. రూ.50 స్కీమ్ తో ముందుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ సంపాదిస్తుందో వేచి చూడాలి.