Begin typing your search above and press return to search.

పేకమేడలు ట్రైలర్ … షార్ట్ కట్స్ ట్రై చేసే బస్తీ కుర్రాడు

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా వచ్చి కొన్ని మూవీస్ పెద్ద హిట్స్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   11 July 2024 9:00 AM GMT
పేకమేడలు ట్రైలర్ … షార్ట్ కట్స్ ట్రై చేసే బస్తీ కుర్రాడు
X

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా వచ్చి కొన్ని మూవీస్ పెద్ద హిట్స్ అవుతున్నాయి. కాంటెంపరరీ స్టోరీ లైన్స్ తో ప్రెజెంట్ జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే విధంగా కథలు చెప్పడంతో అందరు రిలేట్ చేసుకుంటున్నారు. ఈ కారణంగా చిన్న సినిమాలకి మంచి ఆదరణ లభిస్తోంది. బలగం మూవీ అలాగే చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. నిజజీవితానికి దగ్గరగా ఉండే ఏ ఎలిమెంట్ తో కథని చెప్పే ప్రయత్నం చేసిన అలాంటి సినిమాలు వర్క్ అవుట్ అవుతూ ఉంటాయని సినీ విశ్లేషకులు అంటుంటారు.


అలాంటి కాంటెంపరరీ స్టోరీలైన్ తో వస్తోన్న మూవీ పేకమేడలు. యాక్టర్ రాజేష్ వర్రే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో నీలగిరి మామిళ్ళ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కోలీవుడ్ లో యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న వినోద్ కిషన్ ఈ సినిమాతో హీరోగా మారబోతున్నాడు. ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా వినోద్ ప్రతినాయకుడిగా నటించారు.

ఇదిలా ఉంటే తాజాగా మూవీ ట్రైలర్ ప్రేక్షకులు ముందుకొచ్చింది. లక్ష్మణ్ క్యారెక్టర్ హీరో వినోద్ నటించాడు. అలాగే అనూష కృష్ణ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. బస్తీలో పుట్టిన కష్టపడకుండా కోటీశ్వరుడు అయిపోవాలని పగటి కలలు కనే ఓ యువకుడుగా అతని పాత్ర ఉంది. లక్ష్మణ్ భార్య వరలక్ష్మి పాత్రలో అనూష కృష్ణ కనిపిస్తోంది. భర్త ఏదో ఒక ఉద్యోగంతో చేసుకుంటే హ్యాపీగా బ్రతకొచ్చు అనుకునే మధ్యతరగతి వివాహితగా ఆమె పాత్ర ఉంది.

లక్ష్మణ్ ఎలాంటి ఉద్యోగం చేయకుండా బిజినెస్ అనుకుంటూ తిరుగుతూ ఉంటే ఇంటి బాధ్యత మొత్తం చూసుకోవడానికి, రోడ్డు సైడ్ భోజనం బండి పెట్టుకొని వరలక్ష్మి సంపాదిస్తుంది. ఆ డబ్బుని కూడా తన అవసరాల కోసం లక్ష్మణ్ ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. అలాగే భార్య పేరు చెప్పి అప్పులు చేస్తూ ఉంటాడు. తన పగటి కలలతో లక్ష్మణ్ జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు అనేది ఈ కథలో భాగంగా చూపిస్తున్నట్లు కనిపిస్తోంది.

కంటెంట్ కి సరిపోయే విధంగా పేకమేడలు అనే టైటిల్ ని ఖరారు చేశారు. ప్రతి లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలలో ఉండే కష్టాలు, కుర్రాళ్ళ ఆలోచనలని ఈ సినిమాలో క్యారెక్టర్స్ ద్వారా రిప్రజెంట్ చేసినట్లు కనిపిస్తోంది. మ్యూజిక్ కూడా కంటెంట్ సిచువేషన్ కి తగ్గట్లుగ్గానే ఉంది. జులై 19న ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొని వస్తున్నారు. మరి పేకమేడలు మూవీని ఏ మేరకు ఈ కొత్త టీమ్ ప్రేక్షకులకి చేరువ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.