Begin typing your search above and press return to search.

పెళ్లి చూపులు సీక్వెల్.. విజయ్ ఒప్పుకుంటాడా?

త్వరలోనే దానిపై అధికారిక ప్రకటన రానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   21 Feb 2025 8:30 PM GMT
పెళ్లి చూపులు సీక్వెల్.. విజయ్ ఒప్పుకుంటాడా?
X

పెళ్లి చూపులు.. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఓ రేంజ్ లో దూసుకుపోయారు. గీతా గోవిందం, అర్జున్ రెడ్డి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోగా మారిపోయారని చెప్పాలి.

రొమాంటిక్ కామెడీ జోనర్ లో రూపొందిన ఆ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఆ మూవీతో అటు విజయ్.. ఇటు తరుణ్ భాస్కర్ సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి చూపులు సీక్వెల్ కోసం ప్లానింగ్ జరుగుతున్నట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో విజయ్ తో తరుణ్ భాస్కర్ ఓ సినిమా చేస్తున్నారని.. అది ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అని టాక్ వినిపించింది. స్కిప్ట్ రెడీ అయిందని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని, పెళ్లి చూపులు సీక్వెల్ తీసేందుకు మళ్లీ విజయ్, తరుణ్ భాస్కర్ ఫిక్స్ అయ్యారని ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది.

త్వరలోనే దానిపై అధికారిక ప్రకటన రానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. సరిగ్గా పదేళ్ల క్రితం పెళ్లి చూపులు మూవీ రాగా.. అప్పటికీ ఇప్పటికీ చాలా ఛేంజెస్ వచ్చాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఆ మూవీ జోన్ కు భిన్నంగా ఉన్న జోన్ లో ఉన్నారనే చెప్పాలి.

స్పెషల్ సినిమాలతోపాటు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. ఆయన మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు స్మూత్ మూవీగా ఉండే పెళ్లి చూపులు సీక్వెల్ కు ఆయన ఒప్పుకుంటారో లేదోనని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు దానికేమి ఉంది.. చేస్తారని అంటున్నారు.

ఒకవేళ విజయ్ ఒప్పుకోకపోతే.. వేరే హీరోతో తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సీక్వెల్ తీసే అవకాశం కూడా ఉందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. అప్పుడు ఇంకా కొత్తగా ఉంటుందని అంటున్నారు. మరి పెళ్లి చూపులు సీక్వెల్ విషయంలో విజయ్ దేవరకొండ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో ఆసక్తికరంగా ఉందని చెబుతున్నారు. మరి పెళ్లి చూపులు సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో.. విజయ్ నటిస్తారో లేదో వేచి చూడాలి.