Begin typing your search above and press return to search.

బండి క‌ట్టుకుని సినిమాకి ఏలూరు వెళ్లే వాళ్లం! నాగార్జున

ఆ త‌ర్వాత చిరంజీవి..బాల‌య్య‌..వెకంటేష్‌..నాగార్జున లాంటి హీరోలు ఆ విధానాన్ని కొన‌సాగించారు.

By:  Tupaki Desk   |   14 Jan 2024 11:30 AM GMT
బండి క‌ట్టుకుని సినిమాకి  ఏలూరు వెళ్లే వాళ్లం! నాగార్జున
X

సంక్రాంతి వ‌చ్చిందంటే తెలుగు థియేట‌ర్ల‌న్నీ స్టార్ హీరోల సినిమాల‌తో క‌ళ‌క‌ళ‌లా డుతుంటాయి. హీరోల మ‌ధ్య‌ బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా? నేనా? అన్న రేంజ్ లో వార్ జ‌రుగుతుంటుంది. ఈ సంప్ర‌దాయం ఎప్ప‌టి నుంచో తెలుగు సినిమాల్లో ఉంది. ఎన్టీఆర్ ..ఏఎన్నార్..కష్ణ కాలం నుంచి సంక్రాంతి రిలీజ్ లు అనేవి ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉండేవి. ఆ త‌ర్వాత చిరంజీవి..బాల‌య్య‌..వెకంటేష్‌..నాగార్జున లాంటి హీరోలు ఆ విధానాన్ని కొన‌సాగించారు.

ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ హీరోల్లోనూ ఆ విధానం అలాగే కొన‌సాగుతుంది. బాక్సాఫీస్ వ‌సూళ్ల‌కిది మంచి సీజ‌న్ కావ‌డంతోనే సంక్రాంతి రిలీజ్ లు అనేవి ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగుతున్నాయి. పోటీగా ఎన్ని సినిమా లున్నా చిన్న హీరోలు సైతం మేమున్నామంటూ ముందుకొస్తుంటారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో నాగార్జున చిన్న‌త‌నంలో సంక్రాంతి వాతావ‌ర‌ణం ఎలా ఉండేది? అప్ప‌టి వాళ్లు ఎలా సినిమాకి వెళ్లేవారు? అనే పాత‌ సంగ‌తిని గుర్తు చేసుకున్నారు.

14 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ వాళ్ల అమ్మ‌గారి ఇల్లు ఏలూరుకి స‌మీపంలో ఉన్న దెందులూరులోనే సంక్రాంతి పండ‌గ జ‌రుపుకునేవారుట‌. ఆ రోజుల్లో త‌ప్ప‌కుండా సినిమా కి వెళ్లేవారుట‌. ఎన్టీఆర్..ఏఎన్నార్ సినిమాలు సంక్రాతికి క‌చ్చితంగా రిలీజ్ అయ్యేవి. ఆ సినిమాలు చూడ‌టం కోసం దెందులూరు నుంచి ఏలూరుకు ఎడ్ల బ‌ళ్లు క‌ట్టించుకుని వెళ్లేవారుట‌. అప్ప‌ట్లో ప్రేక్ష‌కులు అంతా ఓ చోట చేరి సినిమాకి ఆ ర‌కంగా వెళ్లేవారు.

అది ఎంతో స‌ర‌దాగా ఉండేది. రానుపోను అంద‌రితో క‌లిసి ప్ర‌యాణం ఎంతో స‌ర‌దాగా ఉండేది అన్నారు. ఆ ట్రెండ్ చాలా కాలం పాటు కొన‌సాగింది. ఆ త‌ర్వాత ట్రాక్ట‌ర్లు అందుబాటులోకి వ‌చ్చాక ట్రాక్ట‌ర్ల‌పై అభిమా నులు క‌లిసి క‌ట్టుగా సినిమాల‌కు వెళ్లేవారు. ఇక ఇప్ప‌టి ట్రెండ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఖ‌రీదైన టూవీల‌ర్లు..కార్ల‌లో ప్రేక్ష‌కులు సినిమాల‌కు వెళ్తున్నారు. ఈ సంక్రాంతికి నాగార్జున `నా సామిరంగ‌`తో ప్రేక్షకుల్ని అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.