Begin typing your search above and press return to search.

'పొలిమేర 2' ఫేం కామాక్షికి ఫాల్కే పుర‌స్కారం

సింపుల్ గా క‌నిపిస్తూనే అంద‌మైన డిజైన‌ర్‌ ఫ్రాక్‌లో థై ఎలివేష‌న్ తో మ‌తులు చెడ‌గొడుతున్న ఈ ఫోటోషూట్ క్ష‌ణాల్లో అంత‌ర్జాలంలో వైర‌ల్ అయింది.

By:  Tupaki Desk   |   1 May 2024 3:20 PM GMT
పొలిమేర 2 ఫేం కామాక్షికి ఫాల్కే పుర‌స్కారం
X

తెలుగ‌మ్మాయిలు బోల్డ్ గా మాట్లాడ‌టం బోల్డ్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డ‌డం అన్న‌ది నేటి ట్రెండ్. ఇప్పుడు కాలం మారింది. సీజ‌న్ వ‌చ్చింది. ఇటీవ‌ల తెలుగ‌మ్మాయిల బోల్డ్ ఫోటోషూట్లు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఏంజెలినా జోలీ, జెన్నిఫ‌ర్ లోపేజ్, మ‌డోన్నాకు వీళ్లేమీ త‌క్కువ కాదు అని ప్రూవ్ చేస్తున్నారు. చాలా మంది ఇత‌ర తెలుగ‌మ్మాయిల్లానే టాలీవుడ్ లో ప్ర‌వేశించి స‌త్తా చాటుతోంది కామాక్షి భాస్క‌ర్ల‌. 'మా ఊరి పొలిమేర 2'లో ఈ భామ న‌ట‌న‌కు తెలుగు ప్ర‌జ‌లు ఫిదా అయిపోయారు. డీగ్లామ‌ర‌స్ పాత్ర‌లో ఎంతో అద్భుతంగా న‌టించి మెప్పించారు కామాక్షి. అంతేకాదు కామాక్షి బోల్డ్ ఇంట‌ర్వ్యూలు అప్ప‌ట్లో ఎంతో వైర‌ల్ అయ్యాయి. ప్ర‌చార వేదిక‌పైనా హ‌రీష్ శంక‌ర్ ని మిర‌ప‌కాయ్ అంటూ సూటిగా పిలుస్తూ మాట్లాడినా... .. మిస్ ఇండియా పోటీలు పెద్ద మాఫియా! అని బోల్డ్ కామెంట్ చేసినా కామాక్షి సూటిగా సుత్తి లేకుండా మాట్లాడింది. అందుకే ఈ భామ‌కు ప్ర‌త్యేకించి ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు.


ఇప్పుడు కామాక్షి భాస్క‌ర్ల బోల్డ్ ఫోటోషూట్ ఒక‌టి ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. సింపుల్ గా క‌నిపిస్తూనే అంద‌మైన డిజైన‌ర్‌ ఫ్రాక్‌లో థై ఎలివేష‌న్ తో మ‌తులు చెడ‌గొడుతున్న ఈ ఫోటోషూట్ క్ష‌ణాల్లో అంత‌ర్జాలంలో వైర‌ల్ అయింది. తెలుగ‌మ్మాయి టూమ‌చ్ గా చెల‌రేగుతోందే! అంటూ అభిమానులు ఘాటుగా దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు. కామాక్షి బోల్డ్.. కామాక్షి బ్యూటిఫుల్.. భ‌విష్య‌త్ ఈ అమ్మ‌డిదే! అంటూ ఫ్యాన్స్ పిచ్చెక్కుతున్నారు.

ఈ ఫోటోషూట్ తో పాటు 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్న కామాక్షి భాస్కర్లకు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు యూత్. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన 'మా ఊరి పొలిమేర 2'లో లక్ష్మీ పాత్రలో త‌న ఇంటెన్స్ పెర్ఫామెన్స్‌కుగానూ ఈ పుర‌స్కారం ద‌క్కింది. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమాతో కామాక్షి గుర్తింపు విశ్వ‌విఖ్యాతం అయింది. ఇప్పుడు పుర‌స్కారంతో అది మ‌రింత అద‌న‌పు హంగును అద్దుకుంది. అనూహ్యంగా ఇలా ఫాల్కే పుర‌స్కారాల్లో ఉత్తమ నటిగా అవార్డు గెల‌వటం థ్రిల్లింగ్‌గా ఉంద‌ని కామాక్షి ఆనందం వ్య‌క్తం చేస్తోంది. త‌న‌ న‌టగురువు శేఖ‌ర్, నీజ‌ర్ క‌బీకి ధ‌న్య‌వాదాలు తెలిపింది. అయితే మా ఊరి పొలిమేర 2లో త‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇంత‌టి ప్ర‌తిష్ఠాత్మ‌క‌ అవార్డ్ వ‌స్తుంద‌ని ఊహించ‌లేద‌ని కూడా అంది. మా ఊరి పొలిమేర 2’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించటమే కాకుండా ప్రేక్షకుల, విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. అందుకనే ఈ ప్రతిష్టాత్మక అవార్డు నా మనసులోప్రత్యేకంగా నిలిచిపోతుంద‌ని పేర్కొంది కామాక్షి భాస్కర్ల. పుర‌స్కారంతో ఉత్సాహం.. బోల్డ్ ఫోటోషూట్ల‌తో ఉల్లాసం.. ఈ అమ్మ‌డికి మునుముందు మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని భ‌రోసానిస్తున్నాయి.

స్వ‌గ‌తం :

కామాక్షి భాస్కర్లా ప్ర‌ముఖ‌ మోడల్ కం న‌టి.. డాక్టర్ కూడా. 24 ఫిబ్రవరి 2018న మిస్ తెలంగాణ అందాల పోటీని గెలుచుకుంది. అదే సంవత్సరంలో మిస్ ఇండియా పోటీలో పాల్గొని ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది. కామాక్షి తమిళనాడు, తెలంగాణాలోని హైదరాబాద్‌లో పెరిగారు. హైదరాబాద్‌లోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. 2017లో చైనాలోని గ్వాంగ్జీలోని గ్వాంగ్సీ మెడికల్ యూనివర్సిటీలో MBBS పూర్తి చేసారు. ఆ తర్వాత చైనాలోని ఒక ఆసుపత్రి.. భారతదేశంలోని అపోలో ఆసుపత్రిలో ఇంటర్న్ డాక్టర్‌గా పనిచేసారు. కామాక్షి తండ్రి మురళీకృష్ణ సినిమాటోగ్రాఫర్.. రెండవ యూనిట్ కెమెరామెన్. ఆమె తల్లి గృహిణి. ఆమె సోదరుడు ఇంజనీర్. ప్ర‌స్తుతం పొలిమేర 3లో కామాక్షి న‌టించనున్నారు. మరో రెండు సినిమాలు లైనప్ లోఉన్నాయి.