పూజా హెగ్డే నడుము సొగసు మరో లెవెల్!
సోషల్ మీడియాలో తన స్టైలిష్ లుక్స్, ఫిట్‌నెస్ ఫొటోలతో ఎప్పటికప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది.
By: Tupaki Desk | 2 Dec 2024 3:15 AM GMTటాలీవుడ్‌లో గ్లామర్ తో, నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న పూజా హెగ్డే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరాయి. వైట్ అండ్ బ్లాక్ మిక్స్ లో టాప్, వైట్ షార్ట్ ధరించి భిన్నమైన స్టిల్ ఇచ్చింది. ఆరుబయట సూర్యరశ్మిలో అందాన్ని హైలైట్ చేస్తూ కనిపించింది. ఆమె నడుము అందం, చిరునవ్వు ఫ్యాన్స్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. "సండే సన్‌లైట్" అనే క్యాప్షన్‌తో పూజా పోస్ట్ చేసిన ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
పూజా కెరీర్ తెలుగులో "ఒక లైలా కోసం" సినిమాతో స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత "ముకుంద"తో టాలీవుడ్‌లో మరింత క్రేజ్ అందుకుంది. ఆమెకు అసలైన బ్రేక్ దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో లభించింది. అల్లు అర్జున్ సరసన నటించిన ఈ సినిమాలో పూజా నటన, గ్లామర్ బాగా హైలెట్ అయ్యాయి. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోలతో పూజా అవకాశం పొందింది.
పూజా కెరీర్‌లో "అల వైకుంఠపురములో", "అరవింద సమేత" వంటి విజయవంతమైన చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే, ఇటీవల వరుస ఫ్లాప్స్‌తో ఆమెకు కొంత వెనుకబడింది. "రాధే శ్యామ్", "బీస్ట్", "ఆచార్య" వంటి సినిమాలు ఆశించిన ఫలితాలు అందించలేకపోయాయి. అయినప్పటికీ, పూజా తన హుందాతనంతో ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ప్రస్తుతం పూజా హెగ్డే కోలీవుడ్‌లో రెండు సినిమాలకు సైన్ చేసిందని సమాచారం.
ఇళయదళపతి విజయ్ తదుపరి ప్రాజెక్ట్‌లో నటించబోతోంది. అలాగే బాలీవుడ్‌లో కూడా ఆమెకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. సోషల్ మీడియాలో తన స్టైలిష్ లుక్స్, ఫిట్‌నెస్ ఫొటోలతో ఎప్పటికప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఎప్పటికప్పుడు అమ్మడు సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంటోంది. ఇక రాబోయే సినిమాలలో ఏ ఒక్కటి క్లిక్కయినా అమ్మడు మళ్ళీ స్పీడ్ పెంచే అవకాశం ఉంది.