Begin typing your search above and press return to search.

బికినీలో మ‌రిగిస్తున్న స్టార్ కిడ్

తాజాగా త‌టాకంలో బికినీ గాళ్ అవ‌తారంలో న‌ట‌వార‌సురాలు దుమారం రేపుతున్న ఫోటోలు వెబ్‌లో వైర‌ల్ గా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   3 Dec 2024 7:30 PM GMT
బికినీలో మ‌రిగిస్తున్న స్టార్ కిడ్
X

ఇంకా ఒక‌టో సినిమా అయినా రిలీజ్ కాక‌ముందే గుండెలు మ‌రిగిస్తోంది షాన‌యా క‌పూర్. న‌టుడు సంజ‌య్ క‌పూర్ న‌ట‌వార‌సురాలు షాన‌య‌. సంజ‌య్ .. క‌రిష్మా క‌పూర్ ను పెళ్లాడ‌క ముందు మొద‌టి భార్య మ‌హీప్ క‌పూర్ నుంచి జ‌న్మించిన స్టార్ కిడ్. షాన‌య ఓ భారీ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంద‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. కానీ అది అనూహ్యంగా మిడిల్ డ్రాప్ అవ్వ‌డంతో న‌ట‌వార‌సురాలు తీవ్ర‌మైన డిప్రెష‌న్ కి లోనైంది.

రస్కిన్ బాండ్ చిట్టి కథ అయిన 'ది ఐస్ హావ్ ఇట్' ఆధారంగా రూపొందించిన మ్యూజిక‌ల్ డ్రామా చిత్రం 'ఆంఖోన్ కి గుస్తాఖియాన్‌'లో షాన‌య కపూర్ న‌టిస్తోంది. ప్ర‌తిభావంతుడైన‌ విక్రాంత్ మాస్సే స‌ర‌స‌న న‌టిస్తోంది. స్టార్‌కిడ్ షాన‌య‌ ఈ చిత్రంలో థియేటర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తుంద‌ని తెలిసింది. ట్వ‌ల్త్ ఫెయిల్ తో సంచ‌ల‌నం సృష్టించిన విక్ర‌మ్ మాస్సే ఇందులో అంధ సంగీతకారుడిగా కనిపిస్తాడు. జాలి, ద‌య‌, స్వాతంత్య్రం, ఆత్మ‌విశ్వాం.. మాన‌వ సంబంధాల నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది.

బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ , అపరాన్ వంటి ప్రాజెక్ట్‌లకు పాపుల‌రైన‌ సంతోష్ సింగ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిరంజన్ అయ్యంగార్, మాన్సీ బాగ్లా వంటి ప్రశంసలు పొందిన రచయితలు ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లుగా ప‌ని చేస్తున్నారు. ముంబై , యూరప్‌లో షూటింగ్‌ను షానాయ - విక్రాంత్ పై ప్రారంభిస్తార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ చిత్రాన్ని 2025 మధ్యలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది.

సౌత్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి నటించిన తెలుగు-మలయాళం చిత్రం వృషభ తర్వాత షానయ న‌టించిన రెండవ ప్రాజెక్ట్ ఇది. నంద కిషోర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో మేకా శ్రీకాంత్, రామచంద్రరాజు, జహ్రా ఎస్ ఖాన్, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలు పోషించారు.

కరణ్ జోహార్ నిర్మాత‌గా 'బేధడక్‌'తో షనాయ క‌థానాయిక‌గా ప‌రిచ‌యమ‌వుతుంద‌ని ముందుగా ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు సమాచారం. ధర్మ ప్రొడక్షన్స్ అండ‌దండ‌ల‌తో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ వెబ్ సిరీస్‌లో కూడా కనిపిస్తుంది. మరోవైపు విక్రాంత్ ప్రస్తుతం త‌న‌ థ్రిల్లర్ చిత్రం సెక్టార్ 36 విజయాన్ని ఆస్వాధిస్తున్నాడు. నవంబర్ 15న పెద్ద స్క్రీన్‌లలో విడుదల కానున్న 'ది సబర్మతి రిపోర్ట్‌'లో అతడు ప్ర‌ధాన పాత్ర‌ధారి. ధీరజ్ సర్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా , రిధి డోగ్రా కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

ఇది కాకుండా విక్రాంత్ మాస్సే - రాజ్‌కుమార్ హిరాణీ కాంబినేష‌న్ లో తొలి వెబ్ సిరీస్ తెర‌కెక్కాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గానే 2025లో తాను న‌ట‌న నుంచి గ్యాప్ తీసుకుంటాన‌ని విక్ర‌మాంత్ మాస్సే ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం షాన‌య వ‌రుస ఫోటోషూట్లతో ఆక‌ట్టుకుంటోంది. తాజాగా త‌టాకంలో బికినీ గాళ్ అవ‌తారంలో న‌ట‌వార‌సురాలు దుమారం రేపుతున్న ఫోటోలు వెబ్‌లో వైర‌ల్ గా మారుతున్నాయి.