పొట్టి డ్రెస్సులో గ్లామరస్ దివి.. స్టన్నింగ్!
ఈ తాజా ఫోటోలపై ఆమె ఫ్యాన్స్ "ఫాంటాస్టిక్ లుక్," "స్టన్నింగ్ బ్యూటీ" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దివి లుక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
By: Tupaki Desk | 26 Dec 2024 9:30 PM GMTతెలుగు సినీ పరిశ్రమలో టాలెంట్ తో ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ దివి వద్త్యా తన లేటెస్ట్ లుక్స్‌తో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. హంపిలో దిగిన ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గులాబీ రంగు షార్ట్ డ్రెస్సులో దివి స్టన్నింగ్‌గా కనిపిస్తూ నెటిజన్ల మనసులను దోచుకుంది. అందానికి తగ్గ ఫోటోషూట్‌తో ఆమె అందరినీ ఆకట్టుకుంది.
హంపిలోని ఒక విగ్రహం ముందు దిగిన ఈ ఫోటోలు దివి క్యూట్‌నెస్‌ను మరింత హైలైట్ చేశాయి. గ్లామర్‌తో పాటు, ఆత్మవిశ్వాసం కలగలిపిన దివి తన లుక్‌తో కొత్తగా కనిపిస్తోంది. వీటిలో సింప్లిసిటీ, స్టైల్ కలగలిపినట్టుగా కనిపిస్తున్న ఫోటోలు ఆమె అభిరుచిని స్పష్టం చేస్తున్నాయి. ఈ లుక్స్‌తో దివి ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెరుగుతోంది.
ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో దివి యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు మరింత దగ్గరవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్లు, వ్యక్తిగత అప్డేట్లను పంచుకుంటూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ తాజా ఫోటోలపై ఆమె ఫ్యాన్స్ "ఫాంటాస్టిక్ లుక్," "స్టన్నింగ్ బ్యూటీ" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దివి లుక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
దివి కెరీర్ విషయానికి వస్తే, బిగ్ బాస్ షో ఆమెకి మంచి బూస్ట్ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో కనిపించినప్పటికీ, ఆమె హీరోయిన్ గా కొన్ని మంచి అవకాశాలను అందుకుంది. ‘లంబసింగి’ మూవీ, ‘ఏటీఎం’ వెబ్ సిరీస్ లాంటి ప్రాజెక్ట్‌లతో తన ప్రతిభను నిరూపించుకుంది. అయితే, దివి ఇంకా హీరోయిన్ గా తన ప్రత్యేకతను పూర్తి స్థాయిలో నిరూపించుకోవాలని చూస్తోంది. గ్లామర్ ప్రాజెక్ట్స్‌తో పాటు, నటిగా ప్రత్యేకతను చూపించే సినిమాల్లో అవకాశాలు అందుకోవడంపై దివి దృష్టి పెట్టింది. ఫిట్‌నెస్, ఫ్యాషన్, నటనతో పాటు, ఆమె కాన్ఫిడెన్స్ కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.