సలీం కోసం ఎదురు చూస్తున్న సలీం అనార్లా ఉంది
ఒకటే ట్రిప్.. కానీ రెండు లుక్స్ !! అంటూ సోనాక్షి షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.
By: Tupaki Desk | 7 Nov 2024 1:30 AM GMTసలీం కోసం ఎదురు చూస్తున్న అనార్లా .. దేవదాస్ కోసం వేచి చూస్తున్న పార్వతిలాగా ఉంది.. ఎవరీ సుందరి? అంటారా? కచ్ఛితంగా సోనా అలియాస్ సోనాక్షి. షాట్ గన్ శత్రుఘ్న సిన్హా కుమార్తె. ఇటీవలే ఇంట్లో ఎదురించి నచ్చినవాడిని పెళ్లాడింది. సహనటుడు జహీర్ ఇక్భాల్ తో ప్రేమాయణం సాగించిన సోనాక్షి.. ఇటీవలే పెళ్లితో ఓ ఇంటిదైంది. ఈ మతాంతర వివాహంపై కుటుంబ సభ్యులు తర్జనభర్జన పడ్డారు. చివరికి ప్రేమికులను ఆశీర్వదించారని ముంబై మీడియా కథనాలు వండి వార్చింది.
జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. ప్రతి మలుపులో ఆనందాలను వెతుక్కోవడమే మనిషి విధి. అదంతా సరే కానీ, పెళ్లి తర్వాత తాను ఎంత ఆనందంగా ఉందో సోనాక్షి ఇప్పటికే పలు ఫోటోలు, వీడియోల ద్వారా చెప్పకనే చెప్పింది. పెళ్లి తర్వాత మొదటి కర్వా చౌత్ (అట్ల తద్ది), దీపావళి పండుగలను సోనాక్షి ఎంతో వైభవంగా భర్తతో కలిసి జరుపుకుంది. ఈ వేడుకల నుంచి ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
ఇప్పుడు ఓ పెద్ద కోట వద్ద ఫోటోషూట్లతో కాలక్షేపం చేసింది సోనాక్షి. ఈ ఫోటోషూట్ నుంచి రెండు విభిన్నమైన డిజైనర్ దుస్తుల్లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఒకటే ట్రిప్.. కానీ రెండు లుక్స్ !! అంటూ సోనాక్షి షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. సోనాక్షి అందమైన కాటుక కళ్లు .. ఎంపిక చేసుకున్న డిజైనర్ బ్లౌజ్.. కాంబినేషన్ చీర.. తన అందాన్ని పదింతలు చేసాయి. నిజంగానే సలీం కోసం ఎదురు చూస్తున్న అనార్కలిలా ఉంది. దేవదాస్ కోసం వేచి చూసే పార్వతిని, మజ్ను కోసం వెతికే లైలాను తలపిస్తోంది.