Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ ని 'ఆలూ' అంటూ ఏడిపిస్తార‌ట‌

అయితే ఈ ఛ‌మ‌త్కారమైన మారుపేరు విన్న ఆలియా భట్ ''యే క్యా నయా షురు హో గయా హై ఆలూ జీ (మీరు ప్రారంభించిన ఈ కొత్త విషయం ఏమిటి, ఆలూ జీ)?'' అని వ్యాఖ్యానించింది.

By:  Tupaki Desk   |   17 March 2024 8:50 AM GMT
స్టార్ హీరోయిన్ ని ఆలూ అంటూ ఏడిపిస్తార‌ట‌
X

ఆలియా భట్ ఇటీవల ముంబై ఈవెంట్‌లో క‌నిపించ‌గానే ఫోటోగ్రాఫర్‌లు 'ఆలూ జీ' అని పిల‌వ‌డంతో స‌భికులంతా న‌వ్వేసారు. ఫోటోగ్రాఫ‌ర్లు పదే పదే 'ఆలూ జీ' అని పిలిచేస్తూ ఉంటే, మొదట్లో తాను కూడా అయోమయానికి గురైందిట‌. అయితే ఈ ఛ‌మ‌త్కారమైన మారుపేరు విన్న ఆలియా భట్ ''యే క్యా నయా షురు హో గయా హై ఆలూ జీ (మీరు ప్రారంభించిన ఈ కొత్త విషయం ఏమిటి, ఆలూ జీ)?'' అని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్లతో కలిసి నవ్వేసింది.

ఈ తరంలో అత్యంత ప్ర‌తిభావంత‌మైన నటీమ‌ణుల్లో అలియా భట్ ఒక సంచ‌ల‌నం. హైవే, రాజీ, గంగూబాయి కతియావాడి వంటి సినిమాలతో గొప్ప‌ విజ‌యాలు సాధించిన ఆలియా భ‌ట్ జాతీయ అవార్డు గ్రహీతగాను పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత గౌర‌వాన్ని అందుకుంటోంది. ర‌ణ‌బీర్ తో పెళ్లయిన తర్వాత కుమార్తె రాహాకు జన్మనిచ్చిన ఆలియా త‌దుప‌రి భారీ ప్ర‌ణాళిక‌ల‌ను క‌లిగి ఉంది.

అలియా 2012లో సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్‌లతో కలిసి 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'తో తన అరంగేట్రం చేసింది. నిజానికి ఆలియా కేవలం ఆరేళ్ల వయసులో 1999 చిత్రం సంఘర్ష్ లో యువ ప్రీతి జింటాగా కనిపించింది! ఈ క్రైమ్ థ్రిల్లర్ లో అక్షయ్ కుమార్‌తో కలిసి నటించింది. ముఖేష్ భట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అది వృత్తిగ‌త జీవితం అనుకుంటే, వ్య‌క్తిగ‌తంగా బోలెడంత ఫ‌న్ ని ఆస్వాధిస్తోంది.

ఇంట్లో అలాగే స్నేహితుల్లో వృత్తి ప‌ర‌మైన జ‌ర్నీలో కొలీగ్స్ ఆలియా భ‌ట్ ని మారు పేరుతోనే పిలుస్తార‌నేది మీకు తెలుసా? ఇత‌రుల్లానే త‌న‌కు కూడా ఒక ముద్దు పేరు ఉంది. అది 'ఆలూ'. కుటుంబ సభ్యులే కాదు ఫోటోషూట్ల స‌మ‌యంలో ఫోటోగ్రాఫ‌ర్లు కూడా ఆలూ అని పిలిచేస్తూ త‌న‌ని ఆట‌ప‌ట్టిస్తుంటారు. దానికి ఆలియా భ‌ట్ అందంగా న‌వ్వేస్తుంది కానీ ఫీల‌వ్వ‌దు.

ఆలూ అంటే బంగాళాదుంప. ఆలియా తండ్రి మహేష్ భట్ కూడా త‌న కూతురిని 'ఆలూ కాలు', 'ఆలూ బాలు', 'బటాటా వడ' అని కూడా పిలుస్తార‌ట‌. ఇంట్లో అంద‌రూ త‌న‌ను ఆలూ అని పిలుస్తార‌ట‌. త‌న త‌ల్లి సోనీ ర‌జ్దానీ ఈ పేరును పెట్టారు. అయితే త‌నకు ఆ పేరు పెట్ట‌డానికి కార‌ణం త‌న అస‌లు పేరు ఆలియా కార‌ణం కాదు.. చిన్న‌ప్పుడు ఆలియా ఎంతో ముద్దుగా బ‌బ్లీగా ఉండేదిట‌. అందువ‌ల్ల ఆలూ అని స‌హ‌జంగానే పిలిచేసార‌ని కూడా తెలిసింది.