లెహంగాలో జెన్ -Z బ్యూటీ ఖుషీ అందాల విందు
తనదైన గ్రేస్- స్టైల్‌కు మారుపేరుగా ఖుషీ మేకోవర్ ఆసక్తిని కలిగిస్తోంది.
By: Tupaki Desk | 22 Sep 2023 4:47 AM GMTబాలీవుడ్ లో ప్రవేశించే నటవారసురాళ్లు ఏ వేదికకు వెళ్లినా అక్కడ కేంద్రక ఆకర్షణగా మారుతున్నారు. వేదికకు తగ్గట్టు తమ అందాన్ని ఎలివేట్ చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. మెరుపులు గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో ప్రతి రెడ్ కార్పెట్ ప్రదర్శనతో ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లు అందించడంలో భామలు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు.
నేటితరం Gen-Z నటి ఖుషీ కపూర్ ఇదే పంథాను అనుసరిస్తోంది. తన సోదరి జాన్వీ కపూర్ కి సైతం ఖుషీ పోటీనిచ్చేంతగా ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుకరిస్తోంది. తనదైన గ్రేస్- స్టైల్‌కు మారుపేరుగా ఖుషీ మేకోవర్ ఆసక్తిని కలిగిస్తోంది.
ఇటీవలే అంబానీ కుటుంబం నిర్వహించిన గణేష్ చతుర్థి పార్టీలో ఖుషీ లుక్ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ బ్యూటీ రెడ్ కార్పెట్ పై అడుగుపెట్టగానే షో స్టాపర్ గా అలంకరించింది. ప్రముఖ ఫ్యాషన్ గురు మనీష్ మల్హోత్రా రూపొందించిన అద్భుతమైన ఐవరీ లెహంగాలో స్పాట్‌లైట్ లో వెలిగిపోయింది. ఎంతో సహజంగా అందాన్ని ప్రదర్శించడమే కాకుండా భారతీయ హస్తకళల గొప్ప సంప్రదాయానికి నివాళిగా కనిపించింది ఈ రూపం. ముత్యాలు, స్ఫటికాలు, థ్రెడ్‌వర్క్ ఎంబ్రాయిడరీతో భారీగా అలంకరించిన ఐవరీ లెహెంగాను ధరించింది ఖుషీ.
బరువైన ఫ్లోర్-లెంగ్త్ లెహెంగా స్కర్ట్ వెడల్పాటి వెండి అంచుని కలిగి ఉంది. దీనికి సరిపోలే ఐవరీ టోనల్ ఎంబ్రాయిడరీ-లాడెన్ బ్లౌజ్‌ను ధరించింది. ఫ్లవర్ థ్రెడ్ వర్క్‌తో కూడిన ఈ ఐవరీ పీస్ విలువ రూ. 4.85 లక్షలు.
జోయా అక్తర్ తెరకెక్కించిన ది ఆర్చీస్ సిరీస్ లో నటించింది ఖుషీ. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగుకి రానుంది. OTT సిరీస్ 'ది ఆర్చీస్'ని ప్రకటించినప్పటి నుండి అభిమానులు ఆనందానికి అవధుల్లేవ్. ఈ సినిమాతో ముగ్గురు కొత్త స్టార్ కిడ్స్ అరంగేట్రం చేస్తున్నారు. షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్..అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా ఖుషీ కపూర్ తో పాటు తెరకు పరిచయం అవుతున్న వారిలో ఉన్నారు.