వైట్ టాప్‌లో కవ్వించిన Bడే గాళ్ ఆలయ ఎఫ్
ఈ యంగ్ బ్యూటీ నిజమైన ట్రెండ్‌సెట్టర్. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న కొద్దీ అలయ చిక్ అండ్ టైమ్‌లెస్ ఫ్యాషన్ సెన్స్ కి సంబంధించిన ఫోటోషూట్లు వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 2 Dec 2024 2:30 AM GMTబాలీవుడ్‌లోని అత్యంత పిన్న వయస్కురాలిగా .. అత్యంత స్టైలిష్ ఫ్యాషన్ ఐకాన్‌లలో ఒకరిగా మనసులు గెలుచుకుంటోంది ఆలయ ఎఫ్. జాన్వీ, సారా అలీఖాన్, అనన్య లాంటి వారితో పోలిస్తే ఆలయ ఫర్నిచర్ వాలా వయసు చాలా తక్కువ. కానీ వారందరి కంటే పరిణతితో నెపో కిడ్ అనే పొగరు ప్రదర్శించని స్టార్ కిడ్ అంటూ రెడ్డిటర్లు పొగిడారంటే ఈ అమ్మడిపై ఎంతటి పాజిటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆలయ తన నటనతో మాత్రమే కాకుండా అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ తో హృదయాలను గెలుచుకుంది. అది సాంప్రదాయమైన లుక్ అయినా లేదా సమకాలీనమైనా, ఎలాంటి రూపాన్ని అయినా అప్రయత్నంగా అందరినీ మెప్పించగల సమర్థత తనకు ఉంది.
ఈ యంగ్ బ్యూటీ నిజమైన ట్రెండ్‌సెట్టర్. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న కొద్దీ అలయ చిక్ అండ్ టైమ్‌లెస్ ఫ్యాషన్ సెన్స్ కి సంబంధించిన ఫోటోషూట్లు వైరల్ అవుతున్నాయి. ఆలయ చీరలో హొయలు పోతున్న ఫోటోషూట్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇంతలోనే ఈ భామ నుంచి స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ ని అల్లాడిస్తోంది. ఆలయ వైట్ అండ్ వైట్ లుక్ లో మురిపిస్తున్న ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో అగ్గి రాజేస్తున్నాయి. భానుని లేలేత కిరణాలు ముఖంపై పడుతుంటే ఆలయ ఎక్స్ ప్రెషన్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఆకట్టుకుంది. జవానీ జానేమన్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఆలయ ఎఫ్ టైగర్ ష్రాఫ్ సరసన బడే మియాన్ చోటే మియాన్ లో నటించింది. ప్రస్తుతం భారీ ఫ్రాంఛైజీ చిత్రంలోను ఆలయ నటిస్తుండడం ఆసక్తికరం.