Begin typing your search above and press return to search.

పైర‌సీ వీక్ష‌ణ‌లో 'గేమ్ ఆఫ్ థ్రోన్‌`ని కొట్టేసింది!

గ‌ణాంకాల ప్ర‌కారం.. చాలా కాలంగా టాప్ లో ఉన్న `గేమ్ ఆఫ్ థ్రోన్స్` స్థానాన్ని కూడా ఇది అధిగ‌మించింది.

By:  Tupaki Desk   |   27 Dec 2023 12:22 PM GMT
పైర‌సీ వీక్ష‌ణ‌లో గేమ్ ఆఫ్ థ్రోన్‌`ని కొట్టేసింది!
X

గేమ్ ఆఫ్ థ్రోన్స్.. ఓటీటీ వీక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని ఏకైక షో. ప్ర‌తి ఒక్క‌రి నోటా ప‌లికే ఏకైక షోగా రికార్డుల‌కెక్కింది. కానీ అత్యధికంగా పైర‌సీలో వీక్షించిన షోగా కూడా గేమ్ ఆఫ్ థ్రోన్ రికార్డుల‌కెక్కింది.

ఈ ఏడాది ప్ర‌త్యేకించి పెడ్రో పాస్కల్ న‌టించిన‌ షో `ది లాస్ట్ ఆఫ్ అస్` పైర‌సీకి గురైన అత్యుత్త‌మ షోగా అగ్రస్థానంలో ఉంది. గ‌ణాంకాల ప్ర‌కారం.. చాలా కాలంగా టాప్ లో ఉన్న `గేమ్ ఆఫ్ థ్రోన్స్` స్థానాన్ని కూడా ఇది అధిగ‌మించింది. `గేమ్ ఆఫ్ థ్రోన్` సిరీస్ ముగింపు దశకు చేరుకోవ‌డం కూడా ఒక కార‌ణం.

2020 - 2021లో డిస్నీ+ `వాండవిజన్స్‌`, `ది మాండలోరియన్` ఆధిపత్యం చెలాయించిన తర్వాత HBO `హౌస్ ఆఫ్ ది డ్రాగన్` 2022లో అత్య‌ధికంగా పైరేట్ అయిన షోగా నిలిచింది. ది మాండ‌లోరియ‌న్ తో పోలిస్తే కొత్తగా వచ్చిన `అశోక` చాలా వెనుకంజలో ఉంది. ముఖ్యంగా పైరేట్ అయిన వాటిలో స్ట్రీమింగ్ సర్వీస్ కంటెంట్ మొదటి పది స్థానాల్లో ఉంది. అయితే నెట్ ఫ్లిక్స్ షోలేవి పైర‌సీకి గురైన టాప్ 10 షోల‌ జాబితాలో లేవు.

`ది లాస్ట్ ఆఫ్ అస్` అనేది 2023లో అత్యంత పైరేటెడ్ టీవీ షో కావ‌డానికి కార‌ణం యువ‌త‌రంలో ఈ షోపై ఉన్న‌ ఉత్సుక‌త‌. మ‌రోవైపు పాపుల‌ర్ సిరీస్ `హౌస్ ఆఫ్ ది డ్రాగన్`ని వెన‌క్కి నెట్టి HBO కుటుంబంలో టాప్ షోగా నిల‌వ‌గా, రెండవ స్థానంలో `ది మాండలోరియన్‌` నిలిచింది. డిస్నీ+ సిరీస్ `లోకీ` ఈ సంవత్సరం తొలి మూడు స్థానాల్లో నిలిచింది.

ప్రతి సంవత్సరం చివరిలో టొరెంటింగ్ పైరేట్స్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన టీవీ షోలను పరిశీలించాక ఈ త‌ర‌హా రేటింగ్ ని నిర్ధారిస్తారు. ప్రస్తుత స్ట్రీమింగ్ ల్యాండ్‌స్కేప్ చాలా వ‌ర‌కూ బ్రేక్ అవ్వ‌డంతో చాలా మంది ఓటీటీ స‌భ్యులు మరొక కొత్త చందా చెల్లించే బదులు పైరేట్ చేయడానికి ఇష్టపడుతున్నార‌నేది ఒక స‌ర్వే. ఆసక్తికరంగా, నెట్‌ఫ్లిక్స్ విడుదలలు పైరసీలో గమనించదగ్గ విధంగా లేవు. ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్‌లను వదులుకునే అవకాశం తక్కువగా ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఆధిపత్య స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్.

బిట్‌టొరెంట్ ట్రాఫిక్‌పై ఆధారపడిన స‌ర్వే ఇది. పైరసీ అనే విస్త్ర‌త ప‌రిధి స‌మ‌స్యలో ఇది చిన్న భాగం మాత్ర‌మే. ఇటీవ‌ల‌ చాలా మంది స్ట్రీమింగ్ సైట్‌ల సేవలను ఉపయోగిస్తున్నారు. దీనివ‌ల్ల వీక్ష‌ణ గ‌ణాంకాల‌ను ఎగ్జాక్ట్ గా చెప్ప‌లేం.