ఆండ్రియోతో న్యూడ్ అటెంప్ట్ చేయక తప్పు చేసినట్లు!
అయితే ఈ సినిమా గురించి... ఆండియో గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం నెట్టింట సంచన లమవుతోంది.
By: Tupaki Desk | 28 Jan 2025 6:58 AM GMTకోలీవుడ్ బ్యూటీ ఆండ్రియో జర్మేనియా గురించి చెప్పాల్సిన పనిలేదు. సింగర్ గా ఎంట్రీ హీరోయిన్ గా ఫేమస్ అయిన బ్యూటీ. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషింగల నటి. బోల్డ్ పెర్పార్మెన్స్ లోనూ అమ్మడు ఏమాత్రం వెనక్కి తగ్గదు. మిస్కిన్ అమెలో ఆ బోల్డ్ యాంగిల్ చూసే 'పిసాసు-2'లో అవకాశం ఇచ్చాడు. మిస్కిన్ తెరకెక్కించిన 'పిసాసు' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ గా 'పిసాసు-2' కూడా పూర్తి చేసాడు.
కానీ ఆ సినిమా ఇంత వరకూ రిలీజ్ కాలేదు. 'సైకో' చిత్రం తర్వాత మిస్కిన్ పట్టాలెక్కించిన ప్రాజెక్ట్ ఇదే. దీంతో 'పిసాసు-2'పై మంచి బజ్ క్రియేట్ అయింది. షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఇంతవరకూ ఈ సినిమా రిలీజ్ కాలేదు. అయితే ఈ సినిమా గురించి... ఆండ్రియా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం నెట్టింట సంచన లమవుతోంది. 'పిసాసు -2' కథ విన్నాక ఆండ్రియో నగ్నంగా నటించేందుకు కూడా అంగీకరిచినట్లు తెలిపాడు.
పాత్రను పండించడం కోసం ఆండ్రియో వెనక్కి తగ్గే నటి కాదన్నారు. న్యూడ్ సన్నివేశాలకు సంబంధించి ఫోటో షూట్ కూడా చేయాలనుకున్నారుట. కానీ ఆమె పాత్రని నగ్నంగా చూపిస్తే సమాజంలోకి చెడుగా వెళ్తుందనే ఆందోళనతో ఆ ఛాన్స్ తీసుకోనట్లు తెలిపారు. మరి మీడియా ముందు బోల్డ్ గా మాట్లాడే మిస్కిన్ హీరోయిన్ విషయంలో వెనక్కి తగ్గాడు? అంటే అందులో నిజమెంతో కూడా తేలాలి అన్నట్లు నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు.
'పిసాసు-2' రిలీజ్ కోసమే మిస్కిన్ ఇలా మాట్లాడాడని..నిజంగా ఆండ్రియో తో నగ్న సన్నివేశాలు తీస్తే? సినిమా కూడా రిలీజ్ అయ్యేది. మంచి బిజినెస్ కూడా జరిగేది. 'పిసాసు -2' బజ్ కోసమే మిస్కిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడని నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. నిజంగా తాను ఆండ్రియో తో న్యూడ్ సన్నివేశాలు తీయాల నుకుంటే? ఇలా చెప్పి చేయాల్సిన అవసరం తనకు లేదని...పబ్లిసిటీ కోసమే ఈ వ్యాఖ్యలు అన్నట్లు అభిప్రాయ పడుతున్నారు.