స్టార్ హీరోపై ఈ రూమర్లు నిజమా?
ఈ సంవత్సరం ప్రారంభంలో రాజ్‌కుమార్ రావుకు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది అంటూ పుకార్లు మొదలయ్యాయి.
By: Tupaki Desk | 16 April 2024 12:30 AM GMTనటుడు రాజ్ కుమార్ రావు అంధుడైన తొలి ఎం.ఐ.టి విద్యార్థి, తెలుగు వాడైన శ్రీకాంత్ బొల్లా బయోపిక్ లో నటిస్తూ హాట్ టాపిక్ గా మారాడు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలోను విడుదల కానుంది.
ఆదివారం సాయంత్రం నటుడు గాయకుడు దిల్జిత్ దోసాంజ్ కచేరీలో రాజ్‌కుమార్ రావు అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడు తన భార్య పాత్రలేఖతో కచేరీ వద్దకు చేరుకుని అక్కడ కెమెరాలకు పోజులిచ్చాడు. అతడు పూర్తిగా సన్నగా కనిపించాడు. అతడి కొత్త లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది కొందరు నెటిజనులకు నచ్చలేదు. అతడు సర్జరీ చేయించుకున్నాడని కొందరు ఊహించారు. అతడిని చూస్తుంటే 'ఫైటర్' విలన్ రిషబ్ సాహ్నీని పోలి ఉన్నాడని కొంతమంది సోషల్ మీడియాల్లో కామెంట్ చేసారు.
ఫైటర్ విలన్ లాగా కనిపిస్తున్నాడు! అని సోషల్ మీడియాల్లో ఒక నెటిజన్ రాశారు. అతడు బాడ్ యాస్ బాబుయాలా చాలా హాట్‌గా కనిపించాడు.. అయితే ఇంతగా కొత్త రూపానికి మారాల్సిన అవసరాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను! అని ఒక సోషల్ మీడియాలో నెటిజన్ వ్యాఖ్యానించారు.
అతడు అందమైన స్క్విడ్వర్డ్ లాగా కనిపించాలని ప్రయత్నిస్తున్నాడని మరొకరు అన్నారు. క్షమించండి, అతడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తుంటే ద్వేషిస్తున్నాను! అని మరొకరు రాసారు. అతడిలా మైనపు బొమ్మలా కనిపించడం నాకు సాధ్యం కాదు! అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో రాజ్‌కుమార్ రావుకు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది అంటూ పుకార్లు మొదలయ్యాయి. సిద్ధార్థ్ కన్నన్‌తో ఒక ఇంటర్వ్యూలో, రాజ్‌కుమార్ రావు ఈ వాదనలను ఖండించారు. నహీ భయ్యా, కోయి ప్లాస్టిక్ సర్జరీ నహీ హ్యూ (లేదు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు) అని అన్నారు. ఈ పుకార్లను ఎలా ఎదుర్కొంటారని అడిగినప్పుడు .. ఏం లేదు.. నేను నవ్వుతాను.. ప్రజలు మాట్లాడుకుంటారు.. అంతే! అని వ్యాఖ్యానించాడు.
ఇటీవల విడుదలైన 'అమర్ సింగ్ చమ్కిలా' చిత్రాన్ని రాజ్‌కుమార్ రావు సమీక్షించారు. అతడు ఒక సుదీర్ఘ నోట్ కూడా రాసారు. చమ్కీలా చాలా అద్భుతమైన చిత్రం. తప్పక చూడాలి. దిల్జీత్ జీ.. సర్ మీలాంటి వారు ఎవరూ లేరు. మాకు చమ్కిలా ఇచ్చినందుకు ధన్యవాదాలు. రెహమాన్ సర్.. మీరు ఒక లెజెండ్.. అని రాసారు.