జానీ మాస్టర్ కేసు: ఊహకందని బిగ్ ట్విస్టు
జానీ మాస్టర్ కేసులో ప్రతి రోజూ ఏదో ఒక సెన్సేషన్ బయటకు వస్తోంది.
By: Tupaki Desk | 12 Oct 2024 4:22 AM GMTజానీ మాస్టర్ కేసులో ప్రతి రోజూ ఏదో ఒక సెన్సేషన్ బయటకు వస్తోంది. ఇప్పుడు జానీ మాస్టార్ వేధింపులపై ఆరోపించిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పైనే ఒక యువకుడు పోలీస్ కేసు పెట్టడం సంచలనమైంది. తాను మైనర్ గా ఉన్నప్పుడు ఆమె తనపై లైంగిక వేధింపులకు పాల్పడిందని, బెదిరించి నగ్న ఫోటోలు తీసిందని సదరు యువకుడు నెల్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.
ఇంతకుముందు జానీ మాస్టార్ ని పలు విధాలుగా వేధించిందని అతడి భార్య ఫిలింఛాంబర్ లో ఫిర్యాదు చేసారు. తనను పెళ్లాడాల్సిందిగా వేధించేదని కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై ఆరోపించారు. ఇప్పుడు తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అతడు ఫిర్యాదులో ఇలా పేర్కొన్నాడు.
తన మామ తో హైదరాబాద్, చెన్నై, ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్ళినప్పుడు తనను లైంగికంగా వేధించిందని, లిఫ్ట్ లో, రూమ్ లోను తనను బెదిరించి నగ్న ఫొటోలు తీసి లైంగికంగా వేధించిందని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె బెదిరింపులకు పాల్పడిన సమయంలో తాను మైనర్ అని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అప్పట్లో తాను మైనర్ కావడం వల్లనే ఫిర్యాదు చేయాలని తనకు తెలియదని అన్నాడు. ఇప్పుడు పోలీసులు ఆమెను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు. ఈ కేసు రోజుకో రకంగా వింతగా మారుతోంది. నిజా నిజాలేమిటన్నది పోలీసులే నిరూపించాల్సి ఉంది.