Begin typing your search above and press return to search.

నటుడు శ్రీతేజ్‌ పై FIR.. ఆ యువతి ఫిర్యాదు చేసినందుకే..!

తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

By:  Tupaki Desk   |   26 Nov 2024 9:33 AM GMT
నటుడు శ్రీతేజ్‌ పై FIR.. ఆ యువతి ఫిర్యాదు చేసినందుకే..!
X

టాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలపై వరుసగా కేసులు నమోదు అవ్వడం షాక్ కు గురిచేస్తుంది! తాజాగా నటుడు శ్రీతేజ్ పై కేసు నమోదైంది. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జీరో ఎఫ్ఐఆర్‌ తో కేసును నమోదు చేశారు పోలీసులు.

బీఎన్‌ ఎన్‌ (భారతీయ న్యాయ సంహిత) 69, 115(2), 318(2) సెక్షన్ల కింద శ్రీతేజ్ పై కూకట్ పల్లి పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే శ్రీతేజ్ పై మరో కేసు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలున్నాయి.

అయితే ప్రస్తుతం శ్రీతేజ్ టాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. నాన్ స్టాప్ షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. 2006లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ జీవితం ప్రారంభించిన ఆయన.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే , మౌనరాగం సినిమాలకు పని చేశారు. 2013లో నా సామిరంగా సినిమాతో నటుడిగా మారారు. తొలిసారి వెండితెరపై కనిపించారు.

ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకున్నారు. వంగవీటి మూవీలో దేవినేని నెహ్రూగా కనిపించారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీలో చంద్రబాబు నాయుడు రోల్ లో నటించారు. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప మూవీలో యాక్ట్ చేశారు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ధమాకా సినిమాల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు

గత ఏడాది దళారి, మంగళవారం, రావణాసుర చిత్రాల్లో సందడి చేశారు. ఇటీవల అంజలి నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రలో కనిపించారు. తన యాక్టింగ్ తో మెప్పించారు. ఇప్పుడు పుష్ప ది రూల్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా తన షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేశారు.

అదే సమయంలో మరిన్ని పెద్ద సినిమాల్లో కూడా నటిస్తున్నారు శ్రీతేజ్. అలా కెరీర్ మంచి జోష్ లో ఉన్న టైమ్ లో.. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా శ్రీతేజ్ పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.