కాప్ స్టోరీలతో కాక పుట్టించేలా స్టార్ హీరోలు!
ఈ నేపథ్యంలో వేసవి కానుకగా కొన్ని కాప్ స్టోరీలు ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాయి.
By: Tupaki Desk | 2 Feb 2025 8:30 AM GMTవెండి తెరపై కాకీ కథల పవరేంటో చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలు కాప్ స్టోరీల్లో నటిస్తున్నారంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఆ తరహా సినిమాలు కాస్త తగ్గాయి. డిఫరెంట్ జానర్లవైపు చూడటంతో కాకీ పవర్ తగ్గింది. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు రిలీజ్ అయినా పోలీస్ పాత్ర అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంది. నిఖార్సైన కాకీ కథలకు గ్యాప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వేసవి కానుకగా కొన్ని కాప్ స్టోరీలు ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాయి.
మాస్ రాజా రవితేజ కథానాయకుడిగా భాను భోగవరపు దర్శకత్వంలో 'మాస్ జాతర' తెరకెక్కుతోంది. ఇందులో రాజా పోలీస్ పాత్ర పోషిస్తున్నాడు. విక్రమ మార్కుడు, పవర్, క్రాక్, వాల్తేరు వీరయ్య పోలీస్ తర్వాత మాస్ రాజా మళ్లీ పోలీస్ యూనిఫాంలో కనిపించలేదు. మళ్లీ 'మాస్ జాతర' కోసం యూనిఫాం వేసాడు. అయితే ఈసారి యూనిఫాం వేసింది రైల్వే ప్రొటక్షన్ కోసం. లక్ష్మణ్ భేరి అనే రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.
అలాగే నేచురల్ స్టార్ నాని సీరియస్ పోలీస్ గా ఇంతవరకూ కనిపించలేదు. తొలిసారి 'హిట్ ది థర్డ్ కేస్' కోసం క్రైమ్ ఆఫీసర్ గా బరిలోకి దిగుతున్నాడు. ఇది చాలా సీరియస్ అండ్ పవర్ ఫుల్ రోల్. ఇంటెన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ లోనటించడం ఇదే తొలిసారి. దీంతో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో పవర్ పుల్ గా కనిపించ నున్నాడు. మే1న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి ఓ స్పై థ్రిల్లర్ ని రూపొందిస్తున్నాడు. ఇందులో విజయ్ 'పోకిరి'లో మహేష్ రేంజ్ అండర్ కవర్ కాప్ గా కనిపించనున్నాడు. విజయ్ ఎంతో ఇష్టపడి చేస్తోన్న చిత్రమిది.
మహేష్ రేంజ్ లో ఎలివేషన్లు ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న చిత్రం మేలో మొదటి భాగం రిలీజ్ అవుతుంది. అలాగే యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 'టైసన్ నాయుడు'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బెల్లంకొండ తొలిసారి పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు. ఈపోలీస్ కాస్త డిఫరెంట్ గానూ మెప్పించనున్నాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఇలా ఈ సమ్మర్ వరుస పోలీసు స్టోరీలతో మరింత హీటెక్కనుంది.