బన్నీపై పోలీస్ కేసు..అభిమానులు ఆగ్రహం!
ప్రజలంతా అలా రావడంతో స్థానికులు ఇబ్బంది పడినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసుపై బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 12 May 2024 5:15 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఆయనపై నంద్యాల టూటౌన్ పీఎస్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. నంద్యాల నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా వేలాది మందితో ర్యాలీలో పాల్గొన్నారని పలువురు ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ 31 ఏపీ యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉన్నందున నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాదిమందిగా గుమికూడటం నేరమని.. స్పెషల్ డిప్యూటీ తాసిల్దార్ ఫిర్యాదు మేరకు బన్నీతో పాటు, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కేసులు నమోదయ్యాయి.
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు శనివారం అల్లు అర్జున్ ఆయన నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీని చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
ప్రజలంతా అలా రావడంతో స్థానికులు ఇబ్బంది పడినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసుపై బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ..రవి చంద్రపై కావాలనే కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజక వర్గంలో అంతమంది స్టార్లు వచ్చినప్పుడు అక్కడ ప్రజలకు కలగని అసౌకర్యం నంద్యాల ప్రజలకే కలిగిందా? అని మండిపడుతున్నారు. జబర్దస్త్ కమెడియన్లు...వరుణ్ తేజ్... సాయితేజ్.. వైష్ణవ్ తేజ్..రామ్ చరణ్ లాంటి స్టార్ల రాకతో పిఠాపురం ప్రజలు ఇబ్బంది పడలేదా? అక్కడ లేని ఇబ్బంది నంద్యాలలోనే తలెత్తిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కేసులు పెట్టారని మండిపడుతున్నారు.
నంద్యాల వచ్చిన సందర్భంగా బన్నీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిదే. తన స్నేహితులు అన్న వారికి పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీలో ఉన్నా వచ్చి మద్దతిస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. అదే రోజు రామ్ చరణ్ పిఠాపురం నియోజక వర్గంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.