Begin typing your search above and press return to search.

పొలిమేర 2 ట్రైలర్.. ఒకే చితిలో రెండు శవాలు

మా ఊరి పొలిమేర.. కరోనా సమయంలో ఏమాత్రం అంచనాలు లేకుండా ఓటీటీలో వచ్చి భారీ విజయాన్ని అందుకుంది

By:  Tupaki Desk   |   14 Oct 2023 7:21 AM GMT
పొలిమేర 2 ట్రైలర్.. ఒకే చితిలో రెండు శవాలు
X

మా ఊరి పొలిమేర.. కరోనా సమయంలో ఏమాత్రం అంచనాలు లేకుండా ఓటీటీలో వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. సత్యం రాజేష్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్​ ఆడియెన్స్ వెన్నులో వణుకుపుట్టించింది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. చేతబడి కాన్సెప్ట్​తో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సీక్వెల్​తో రాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడడంతో తాజాగా ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్​. ఇది కూడా ​వెన్నులో వణుకుపుట్టించేలా ఉంది!

వివరాళ్లోకి వెళితే.. స‌త్యం రాజేశ్ కెరీర్​లో పెద్ద హిట్​గా నిలిచింది మా ఊరి పొలిమేర. ఇప్పుడు సీక్వెల్​లోనూ ఆయన ప్రధాన పాత్రలో.. గెట‌ప్ శ్రీను, డా. కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేంద్ మౌళితో కలిసి​ మా ఊరి పొలిమేర 2లో నటించారు. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మించారు. ఈ చిత్రానికి కూడా అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కత్వం వహించారు. నవంబర్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ట్రైలర్ లాంఛ్​ ఈవెంటును హైదరాబాద్ - AAA సినిమాస్‌లో నిర్వహించి.. చిత్రానికి సంబంధించిన థియేట్రికల్​ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది, అసలు చేతబడలు అనేవి నిజంగానే ఉన్నాయా? ఒకే చితిలో రెండు శవాలు.. అంటూ యాంకర్ చదివే డైలాగ్స్​తో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రంలో ప్రతివాడి నిజాయితీకి ఓ రేటు ఉంటుంది. అది వాడి వీక్​నెస్ బట్టి ఉంటుంది అని హీరో క్యారెక్టర్​ను చూపించారు. పొలిమేరలో ఓ గుడి ఉండటాన్ని చూపించారు. ప్రతి ఊరి గుడికి హిస్టరీ ఉంటే.. ఈ గుడికి మాత్రం మిస్టరీ ఉండటం అంటూ గుడి చుట్టూ కథను తిప్పారు. అయితే ఈ గుడికి ఓ శాపం ఉందని, నాగబంధం తెంచాలంటే.. బంధాన్ని తెంచుకోవాలని, నరబలి చేయాలంటూ సీన్స్​ను సస్పెన్స్​గా చూపించారు. స్వార్థంతో చేస్తే హత్య, ఆశయంతో చేసే యుద్ధం, స్వార్థంతో చేసే ఏ యుద్ధంలో అయినా ఆశ ఉంది కానీ ఆశయం ఏడుంది మామ అంటూ వచ్చే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఫైనల్​గా ఈ గుడికి - అనంత పద్మనాభ స్వామి గుడికి ఏమైనా సంబంధం ఉందా అంటూ ప్రచార చిత్రాన్ని ముగించారు.

మొత్తంగా ఈ ప్రచార చిత్రం చాలా గ్రిప్పింగ్​గా, సస్పెన్స్​గా, ఇంట్రెస్టింగ్​గా సాగింది. ఇందులో కూడా మొదటి భాగంలానే చేతబడి కాన్సెప్ట్​ను రిపీట్ చేశారు. కొన్ని సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. మొదటి భాగాన్ని మించిలా ఈ సినిమా కోసం ఖర్చు చేశారని అర్థమవుతోంది. అందుకే విజువల్స్ నెక్స్ట్ లెవల్లో కనిపిస్తున్నాయి. సీన్స్ సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నాయి.