స్టార్ కపుల్ మధ్య రాజకీయ విభేదాలు
అందుకే తమ కుటుంబంలో ఎప్పుడూ కూడా రాజకీయపరమైన చర్చలు రాకుండా చూసుకుంటామని అక్షయ్ కుమార్ సరదాగా ఒక చిట్ చాట్ లో పేర్కొన్నాడు.
By: Tupaki Desk | 13 Oct 2023 6:11 AM GMTభార్యా భర్తలు అయినంత మాత్రాన ప్రతి విషయంలో కూడా ఒకే అభిప్రాయం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. సాధారణ మధ్య తరగతి కుటుంబాల్లో భార్యా భర్తలు మనసులో ఏమున్నా కూడా ఒక విషయంపై ఒకే అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తారు. కానీ సెలబ్రిటీ ఫ్యామిలీల్లో ఎవరి అభిప్రాయాలు వారివి.. అందుకే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల ఫ్యామిలీలో గొడవలు ఎక్కువ అవుతూ విడిపోతున్నారు అని టాక్ కూడా ఉంది.
ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.. తాను చెప్పిందే గొప్ప అన్నట్లుగా కాకుండా ఇద్దరూ ఒకే అభిప్రాయంతో ఉండాలి. నా మాట వినాల్సిందే. అనుకోవడం కూడా తప్పుడు నిర్ణయం అవుతుంది. కనుక ఏదైనా విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ విషయం గురించి చర్చించక పోవడం మంచిది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇప్పుడు అదే ఫార్ములాను పాటిస్తున్నాడట. అక్షయ్ కుమార్ కి ఆయన భార్య ట్రింకిల్ కన్నా కి మధ్య రాజకీయపరంగా చర్చ వచ్చినప్పుడు ఇద్దరు కూడా విభేదించుకుంటున్నారట.
రాజకీయంగా ఇద్దరు రెండు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారట
దాంతో రాజకీయంగా చర్చ జరిగిన ప్రతిసారి కూడా విభేదాలు తలెత్తుతున్నాయి అంటూ అక్షయ్ కుమార్ ఒప్పుకున్నాడు. అందుకే తమ కుటుంబంలో ఎప్పుడూ కూడా రాజకీయపరమైన చర్చలు రాకుండా చూసుకుంటామని అక్షయ్ కుమార్ సరదాగా ఒక చిట్ చాట్ లో పేర్కొన్నాడు. సంతోషకరమైన జీవితాన్ని సాగించాలి అనుకున్నప్పుడు కచ్చితంగా కొన్ని విషయాల పట్ల చూసి చూడనట్లుగా వదిలేయాలి అలాగే కొన్ని విషయాలను మరీ ఎక్కువగా లాగకుండా సైలెంట్ అవడం మంచిది అనే ఉద్దేశంతో తాను మరియు ట్వింకిల్ ఇంట్లో రాజకీయాల గురించి మాట్లాడడం మానేశామంటూ అక్షయ్ కుమార్ తాజా చిట్ చాట్ లో చెప్పుకొచ్చాడు.
కరోనాకు ముందు అక్షయ్ కుమార్ ప్రతి సినిమా కూడా 100 నుండి 500 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబడుతూ వచ్చింది. కానీ కరోనా తర్వాత అక్షయ్ కుమార్ ఒక్క సినిమాతో కూడా కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలను విడుదల చేస్తున్న అక్షయ్ కుమార్ ప్రతి సినిమాతో కూడా అభిమానులను నేరుగా నిరాశ పర్చుతు.. తాను కూడా నిరాశ పడుతున్నాడు. ముందు అయినా అక్షయ్ కుమార్ గత జోష్ ని దక్కించుకుంటాడేమో చూడాలి.