Begin typing your search above and press return to search.

న‌ట‌న‌లో వీక్ అందుకే అందాలు ఎర వేసాను!

పూజా బేడీ ప్రముఖ నటుడు కబీర్ బేడీ కుమార్తె .. ఒక యువ నటికి తల్లి కూడా. ఆలయ ఎఫ్ త‌న కుమార్తె. త‌న గారాల ప‌ట్టీ గురించి పూజా ఈ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.

By:  Tupaki Desk   |   4 Nov 2024 9:30 PM GMT
న‌ట‌న‌లో వీక్ అందుకే అందాలు ఎర వేసాను!
X

చాలా తక్కువ మంది నటీమణులు మాత్ర‌మే తమలోని లోపాల గురించి నిక్కచ్చిగా మాట్లాడగలరు. ఉన్న‌ది ఉన్న‌ట్టు అంగీక‌రించేందుకు ధైర్యం చేయ‌గ‌ల‌రు. అలా ఈ న‌టీమ‌ణి నిజాన్ని అంగీక‌రించ‌డ‌మే గాక‌, దానికి మసాలాను జోడించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన FICCI ఫ్లో ఈవెంట్‌లో సీనియ‌ర్ న‌టి పూజా భేడీ తన బోల్డ్ స్టేట్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

నేను భయంకరమైన నటిని. నా పేలవమైన నటన నుండి దృష్టి మరల్చడానికి తరచుగా నా క్లీ*జీ ని ఉపయోగించేదానిని అని పూజా వ్యాఖ్యానించారు. తాను చిత్ర పరిశ్రమలోకి ఎలా ప్రవేశించిందో వివరించిన పూజా బేడీ.. ఎప్పుడూ నటించాలని అనుకోలేదని కూడా తెలిపింది. నా మొదటి సినిమా అనుకోకుండా కుదిరింది. నాకు డబ్బు అవసరం కాబట్టి నేను జో జీతా వోహీ సికందర్ (1992) మాత్రమే చేసాను అని తెలిపింది.

ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ ఫిల్మ్‌లో అమీర్ ఖాన్ క‌థానాయ‌కుడు. మార్లిన్ మన్రో స్టైల్ పోజ్‌తో పాటు పూజా ఎరుపు రంగు దుస్తులు త‌న‌ తొలి ప్రదర్శనను చిరస్మరణీయం చేసింది. ఈ సినిమాతో సె* సింబల్ అని కూడా త‌న‌కు ట్యాగ్ ఇచ్చారు. దీనిపై పూజా మాట్లాడుతూ.. ప్రారంభం ఆ లేబుల్‌తో అసౌకర్యంగా ఉన్నాను. కానీ నన్ను సె* అని పిలుస్తానంటే.. ఆ పిలుపును వోన్ చేసుకోవచ్చని ..ఈ రంగంలో దానివ‌ల్ల‌ అత్యుత్తమంగా ఉండవచ్చని భావించిన‌ట్టు పూజా తెలిపారు.

పూజా బేడీ ప్రముఖ నటుడు కబీర్ బేడీ కుమార్తె .. ఒక యువ నటికి తల్లి కూడా. ఆలయ ఎఫ్ త‌న కుమార్తె. త‌న గారాల ప‌ట్టీ గురించి పూజా ఈ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. అలయ ఉదయం 6 గంటలకు మేల్కొంటుంది. ముందుగా షెడ్యూల్‌ను తెలుసుకుంటుంది. తన పనిపై పూర్తిగా దృష్టి సారిస్తుంది. ఏదీ ఆమె దృష్టిని మరల్చలేదని తెలిపారు. అలయ ఎఫ్ నాలుగు సంవత్సరాల క్రితం జవానీ జానేమాన్ (2020)తో కెరీర్ ని ప్రారంభించింది. ఇటీవల అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, మానుషి చిల్లర్‌లతో భారీ-బడ్జెట్ యాక్షన్ చిత్రం బడే మియాన్ చోటే మియాన్ (2024)లో కూడా కనిపించింది.

బంధుప్రీతిపైనా..

సినీప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే బంధుప్రీతి అని ఎందుకు అరుస్తారో వింత‌గా అనిపిస్తుంద‌ని పూజా భేడి అన్నారు. ఒక వ్యాపారవేత్త కుమారుడు తన తండ్రి అడుగుజాడల్లో నడవడం లేదా డాక్టర్ బిడ్డ డాక్టర్ అవ్వ‌డం చూస్తే ఎవరూ ఒక్క మాట కూడా అనరు. న‌టుల‌ను అన‌డం నన్ను కలవరపెడుతుందని వ్యాఖ్యానించారు. పూజా భేడి తెలుగులోను ప‌లు చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.