Begin typing your search above and press return to search.

పూజా హెగ్డేకి డేంజర్‌ బెల్స్ కంటిన్యూ

దాంతో పూజా హెగ్డే కెరీర్‌కి డేంజర్‌ బెల్స్ స్టార్ట్‌ అయ్యాయి అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   6 Feb 2025 6:30 PM GMT
పూజా హెగ్డేకి డేంజర్‌ బెల్స్ కంటిన్యూ
X

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన పూజా హెగ్డే చాలా తక్కువ సమయంలోనే ఫేడ్‌ ఔట్ అయ్యింది. తెలుగులో ఈమె చివరగా అల వైకుంఠపురంలో సినిమాతో హిట్‌ కొట్టింది. ఆ సినిమా తర్వాత రాధేశ్యామ్‌ సినిమా పూజా హెగ్డేకి తీవ్రంగా నిరాశను మిగిల్చింది. ఈ అమ్మడు టాలీవుడ్‌కి దాదాపుగా దూరం అయ్యింది. గత ఏడాది ఈమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అంతకు ముందు సంవత్సరం సల్మాన్‌ ఖాన్‌తో నటించిన కిసీ క భాయ్ కిసీకి జాన్‌ సైతం డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో పూజా హెగ్డే కెరీర్‌కి డేంజర్‌ బెల్స్ స్టార్ట్‌ అయ్యాయి అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేశారు. పూజా హెగ్డే దాదాపు రెండేళ్ల తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంది.

ఈ ఏడాది పూజా హెగ్డే నుంచి మూడు నాలుగు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఒకటి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించిన 'దేవా' సినిమాలో పూజా హెగ్డే నటించింది. సినిమాపై పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ చేయడంలో యూనిట్‌ సభ్యులు సక్సెస్ అయ్యారు. కానీ సినిమా కంటెంట్‌తో మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యారు. ఇటీవల బాక్సాఫీస్‌ వద్దకు వచ్చిన దేవా సినిమా మొదటి రోజు నుంచే దారుణమైన కలెక్షన్స్‌ను చూస్తూ వచ్చింది. లాంగ్‌ రన్‌లో ఈ సినిమా పాతిక కోట్లు వసూళ్లు చేస్తే గొప్ప విషయం అన్నట్లుగా పరిస్థితి ఉంది. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా ఈ ఏడాదిలోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

దేవా సినిమాతో బాలీవుడ్‌లో కాస్త గుర్తింపు వస్తే చిన్నా చితకా సినిమాల్లో నటించాలని ఆశ పడ్డ పూజా హెగ్డేకి పెద్ద షాక్ తగిలింది. గతంలోనూ బాలీవుడ్‌లో పూజా హెగ్డే సినిమాలు చేసింది. అప్పుడు కాస్త పర్వాలేదు అన్నట్లు ఉన్నా.. ఈసారి మరీ డిజాస్టర్‌ ఫలితాన్ని చవిచూసింది. టాలీవుడ్‌లో ఆఫర్లు అసలే లేవు. కానీ కోలీవుడ్‌లో మాత్రం ఈ అమ్మడికి ఆఫర్లు ఒక మోస్తరుగా వస్తున్నాయి. సూర్య హీరోగా నటిస్తున్న రెట్రో సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా తమిళ్‌ సూపర్ స్టార్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్న చివరి సినిమాలోనూ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ ఏడాదిలో పెద్ద రిలీజ్‌లు ఉన్న కారణంగా పూజా హెగ్డే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ దేవా సినిమా ఫ్లాప్ కావడంతో ఆమెకి మరో దెబ్బ పడింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అయినా సక్సెస్ అయితే పర్వాలేదు, లేదంటే ఈ ఏడాదితోనే పూజా హెగ్డే కెరీర్‌ ఖతం అవుతుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దేవా సినిమాతో మరో డేంజర్‌ బెల్‌ పడ్డ నేపథ్యంలో పూజా హెగ్డే ఇకపై అయినా సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. టాలీవుడ్‌లో ఎలాగూ పూజా హెగ్డే కమ్‌ బ్యాక్ సాధ్యం కాకపోవచ్చు.. కనీసం కోలీవుడ్‌లో అయినా ఈమె స్టార్‌ డం కంటిన్యూ అవుతుందా అనేది ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగిస్తోంది.