ప్రభాస్ ని మెచ్చుకోని ఒకే ఒక్క హీరోయిన్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పనిచేసిన వారంతా అతని గురించి ఎంత గొప్పగా ఫీడ్ బ్యాక్ ఇస్తారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 1 Dec 2024 6:30 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పనిచేసిన వారంతా అతని గురించి ఎంత గొప్పగా ఫీడ్ బ్యాక్ ఇస్తారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. మిగతా నటీనటులందర్నీ పక్కన బెట్టి హీరోయిన్ల స్పందన చూస్తే ఎంతో గొప్పగా ఉంటుంది. ప్రభాస్ తొలి సినిమా హీరోయిన్ శ్రీదేవి నుంచి `కల్కి 2898` భామ దీపికా పదుకొణే వరకూ అందరూ డార్లింగ్ పై ఎంతో ప్రేమ చూపించిన వారే. శ్రుతిహాసన్, త్రిష, కృతి సనన్, శ్రద్దా కపూర్, అనుష్క ఇలా వీళ్లంతా ప్రభాస్ గురించి చెప్పమంటే? టైమ్ తెలియకుండా చెబుతారు.
ప్రభాస్ చూపించే ప్రేమాభిమానం నుంచి ఇంటి నుంచి తెప్పించే పుడ్ వరకూ ! డార్లింగ్ అంటే అందరూ ఎంతో స్వీట్ గయ్ అనేస్తారు. ఇక మిగతా నటీనటుల గురించి, దర్శక హీరోల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా ప్రభాస్ అంటే అభిమానం..ఇష్టం చూపించే వారెంతో మంది. కానీ ఆ ఒక్క భామ మాత్రం ప్రభాస్ తో నటించినా ఏనాడు డార్లింగ్ గురించి ఒక్క ముక్క మాట్లాడింది లేదు. ఇంతకీ ఎవరా భామ అంటే? ముంబై బ్యూటీ పూజాహెగ్డే.
వీళ్లిద్దరు జంటగా `రాధేశ్యామ్` లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. పైగా అదో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రం. కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లోనూ నటించారు. ప్రచారం సమయంలోనూ కలిసి పాల్గొన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ సందర్భంలోనూ అమ్మడి నోట ప్రభాస్ పేరు మాత్రం రాలేదు. అంతకుముందు పూజాహెగ్డే పనిచేసిన హీరోల గురించి ఆయా చిత్రాల ప్రచారం సమయంలోనూ...మరో రకంగానో స్పందించిన సందర్భాలున్నాయి.
కానీ డార్లింగ్ గురించి గానీ, ఆయన వడ్డించే పుడ్ గురించి గానీ ఎక్కడా మాట్లాడలేదు. అయితే `రాధేశ్యామ్` షూటింగ్ సమయంలో ఆ చిత్ర యూనిట్ తో పూజాహెగ్డే వివాదం ఒకటి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. డేట్ల విషయంలో నిర్మాతలతో చిన్నపాటి డిస్కషన్ వచ్చిందని అప్పట్లో వైరల్ అయింది. సదరు నిర్మాతలు డార్లింగ్ కి బాగా కావాల్సినవారు. దీంతో పూజాహెగ్డే సదరు టీమ్ తో కాస్త దూరంగానే ఉందని అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. మరి ఆ రకంగా ఏర్పడిన గ్యాప్ నోట ప్రభాస్ మాట రానివ్వలేదా? అన్న సందేహం నెటి జనుల్లో కనిపిస్తుంది.