బుట్టబొమ్మలో భయంకరమైన మార్పులా?
అధికా పారితోషికం డిమాండ్ చేయడంతో పాటు అదనపు సిబ్బందిని సెట్స్ కి తీసుకొచ్చి తమకు భారంగా మారుతుందని ఆరోపించారు.
By: Tupaki Desk | 11 Oct 2024 6:27 AM GMTఫాం..ఫేం లో ఉన్నంత కాలం బుట్టబొమ్మ పూజాహెగ్డే ఏ రేంజ్ లో సౌత్ ని అల్లాడించిందో చెప్పాల్సిన పనిలేదు. వరుసగా స్టార్ హీరోలందరితో పనిచేసింది. లాంచింగ్ బెడిసి కొట్టినా? అటుపై అన్నీ కలిసొచ్చాయి. దీంతో తెలుగు, తమిళ్ లో మంచి అవకాశాలు అందుకుంది. సరిగ్గా ఇదే సమయంలో అమ్మడిపై ఎన్నో ఆరోపణలు తెరపైకి వచ్చాయి. కోలీవుడ్ నిర్మాతలు బాహాటంగానే అమ్మడి తీరును తప్పుబట్టారు. అధికా పారితోషికం డిమాండ్ చేయడంతో పాటు అదనపు సిబ్బందిని సెట్స్ కి తీసుకొచ్చి తమకు భారంగా మారుతుందని ఆరోపించారు.
తన వ్యక్తిగత ఛార్టెడ్ ప్లైట్ ఖర్చులు సైతం తమపై రుద్దుతుందని...ఇదే అన్యాయం అంటూ ఓపెన్ గానే మాట్లాడారు. అటుపై `రాధేశ్యామ్` రిలీజ్ సమయంలో డేట్ల విషయంలో ఆసినిమానిర్మాతల్నికూడా ఇబ్బంది పెట్టిందని.. .ప్రచారానికి సైతం సరిగ్గా హాజరు కాలేదనే ఆరోపణలు ఎదుర్కుంది. ఆ తర్వాత అమ్మడు బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అప్పటికి సౌత్లో మంచి ఫాంలోనే ఉంది. కానీ తన టార్గెట్ సౌత్ కాదు...బాలీవుడ్ అంటూ ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికి వెళ్లిపోయింది. కానీ అక్కడ కెరీర్ సంగతి చాలా తక్కువ సమయంలోనే అర్దమైంది.
దీంతో మళ్లీ బ్యాక్ టూ పెవిలియన్అంటూ సౌత్ ఇండస్ట్రీకి వచ్చింది. ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలు..తమిళ్ లో రెండు సినిమాలకు సైన్ చేసింది. అయితే తమిళ సినిమాలకు పారితోషికం విషయంలో మినహాయింపు ఇచ్చింద నే ప్రచారం జరుగుతోంది. మునుపటిలా పారితోషికం అధిక మొత్తంలో డిమాండ్ చేయకుండా నిర్మాతలకు సహకరిస్తుందిట. అంతేకాదు మిగతా విషయాలపట్ల అమ్మడు సానుకూల దృక్ఫదాన్నివ్యక్తం చేస్తుందిట.
అంటే మొత్తానికి అమ్మడిలో మార్పులు మొదలైనట్లే కదా. ఇది ఏమాత్రం ఎవరూ ఊహించనది. అంతేగా రోజులన్నీ ఒకేలా ఉండవు. వెలుగు తర్వాత చీకటి వస్తుంది అన్నది కూడా మర్చిపోకూడదు అనే విషయాన్ని వంట పట్టించుకుంటే చాలు.