Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ పూజలు ఫ‌లించేనా?

ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి పేరు తెచ్చుంది.

By:  Tupaki Desk   |   3 April 2025 11:34 AM
బుట్ట‌బొమ్మ పూజలు ఫ‌లించేనా?
X

ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి పేరు తెచ్చుంది. త‌క్కువ టైమ్ లోనే పూజా అంద‌రి హీరోల స‌ర‌స‌న న‌టించి అగ్ర హీరోయిన్ గా మారింది. అయితే వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండే పూజా హెగ్డేకు ఉన్న‌ట్టుండి టాలీవుడ్ లో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దీంతో ఒక్క‌సారిగా తెలుగులో పూజా క‌నిపించ‌డం మానేసింది.

అదే టైమ్ లో పూజా బాలీవుడ్ కు వెళ్లి అక్క‌డా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది కానీ ఉప‌యోగం లేక‌పోయింది. గ‌త కొంత‌కాలంగా పూజా కెరీర్ ఏమంత ఆశాజ‌న‌కంగా లేదు. టాలీవుడ్ లో అయితే పూజా హెగ్డే సినిమా వ‌చ్చి రెండేళ్ల‌వుతుంది. ఎలాగైనా సౌత్ లో మ‌ళ్లీ జెండా పాతాల‌ని చూస్తున్న పూజా దానికి త‌గ్గ‌ట్టే అడుగులు వేస్తోంది.

ప్ర‌స్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స‌ర‌స‌న రెట్రో సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్న పూజా హెగ్డే ఆ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని చూస్తోంది. రెట్రో తో పాటూ సూప‌ర్ స్టార్ రజినీకాంత్- లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న కూలీ సినిమాలో పూజా స్పెష‌ల్ సాంగ్ చేస్తోంది. ఈ రెండింటితో పాటూ రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోయే కాంచ‌న‌4లో కూడా పూజా ఛాన్స్ అందుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ మూడు సినిమాలు స‌క్సెస్ అయితే మ‌ళ్లీ పూజా సౌత్ లో బిజీ అయ్యే అవ‌కాశాలున్నాయి. అయితే స‌రైన ఛాన్సులు లేక ఇబ్బంది ప‌డుతున్న పూజా కొన్ని పూజలు చేసి ఆ దోషాల‌ను పోగొట్టుకోవాల‌ని డిసైడైన‌ట్టుంది. అందుకే ఇవాళ తిరుప‌తిలోని శ్రీ కాళ‌హ‌స్తి గుడికి వెళ్లి అక్క‌డ రాహుకేతు పూజలో పాల్గొంది. కుటుంబంతో స‌హా పూజలు చేయించుకున్న బుట్ట‌బొమ్మ పూజలు అయ్యాక దైవ ద‌ర్శ‌నం చేసుకుంది. అనంత‌రం అక్క‌డి వేద పండితులు ఆమె కుటుంబానికి ఆశీర్వచనాల‌తో పాటూ ప్ర‌సాదాలు అందించారు. మ‌రి రాహుకేతు పూజ‌లు చేయించాక అయినా పూజాకు కెరీర్లో మంచి ఆఫ‌ర్లు వ‌చ్చి అమ్మ‌డి పూజ‌లు ఫ‌లిస్తాయేమో చూడాలి. ప్ర‌స్తుతం పూజా శ్రీ కాళ‌హ‌స్తి వెళ్లి పూజ‌ల్లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.