Begin typing your search above and press return to search.

పూజానే అన్ లక్కీ ఎందుకు..?

ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న పూజా బేబ్ ఇటు తమిళ్ లో సూర్యతో రెట్రో, దళపతి విజయ్ తో జన నాయగన్ సినిమా చేస్తుంది.

By:  Tupaki Desk   |   18 Feb 2025 3:00 AM GMT
పూజానే అన్ లక్కీ ఎందుకు..?
X

బుట్ట బొమ్మ పూజా హెగ్దే కెరీర్ రిస్క్ లో ఉందని తెలిసిందే. అమ్మడు చేస్తున్న సినిమాలే తక్కువ అంటే అవి వరుస నిరాశ పరచడం వల్ల గ్రాఫ్ మరింత పడిపోతుంది. మొన్నటిదాకా సౌత్ లో మెరుపులు మెరిసిన పూజా హెగ్దే తెలుగులో అయితే వరుస స్టార్ సినిమాలతో దూసుకెళ్లింది. ఐతే సినిమాలు కూడా సక్సెస్ అవ్వడంతో అమ్మడికి ఛాన్స్ లు ఇచ్చారు. ఐతే ప్రభాస్ తో రాధే శ్యామ్ ఫెయిల్యూర్ వల్ల పూజా హెగ్దే కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత మహేష్ తో చేయాల్సిన గుంటూరు కారం కూడా వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యింది.

మరోపక్క బాలీవుడ్ లో పూజా దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. అదేంటో పూజా హెగ్దే సినిమా అంటే చాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తుంది. కొన్నాళ్లు గ్లామర్ తో నెట్టుకొచ్చింది అమ్మడు ఇప్పుడు తను హిట్ ట్రాక్ ఎక్కేందుకు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయింది. పూజా హెగ్దే అన్ లక్కీగా మారిపోయింది. ఎవరైనా హిట్లు పడుతున్న హీరోయిన్ కి ఛాన్స్ లు ఇస్తారు. సో ఫ్లాపుల వల్ల పూజాకి భారీ లాస్ ఏర్పడుతుంది.

చేతిలో ఉన్న సినిమాలైనా హిట్ కొడతాయా లేదా అన్న డౌట్ మొదలైంది. ఇన్ని ఫ్లాపుల్లో కూడా పూజా హెగ్దే అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న పూజా బేబ్ ఇటు తమిళ్ లో సూర్యతో రెట్రో, దళపతి విజయ్ తో జన నాయగన్ సినిమా చేస్తుంది. ఈ సినిమాలు కూడా పూజా ఖాతాలో ఫ్లాప్ పడితే మాత్రం ఇక అమ్మడిని తిరిగి చూసే వారు ఉండరని చెప్పొచ్చు. పూజా హెగ్దే మాత్రం ఇంకా తన హోప్స్ ని మాత్రం వదలట్లేదు.

తెలుగులో ఇప్పటికీ తనకు అవకాశం వస్తుందని భావిస్తుంది బుట్ట బొమ్మ. ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ దాకా వచ్చి చివరి నిమిషంలో మిస్ అయ్యాయని టాక్. మరి బాలీవుడ్ లో బ్యాడ్ లక్ వెంటాడుతున్న పూజా హెగ్దేకి సౌత్ సినిమాలైనా ఆమె ఫేట్ మారుస్తాయా లేదా అన్నది చూడాలి. పూజా హెగ్దే ఫ్యాన్స్ మాత్రం అమ్మడి గ్లామర్ షో మిస్ అవుతున్నారని మాత్రం చెప్పొచ్చు. గుంటూరు కారం మిస్ చేసుకున్నందుకు ఆఫర్లు రావట్లేదా మరి డేట్స్ అడ్జెస్ట్ అవ్వక కుదరట్లేదా తెలియదు కానీ పూజా హెగ్దే ని టాలీవుడ్ సడెన్ గా దూరం పెట్టడం మాత్రం ఆమె ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది.