Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ కంబ్యాక్..ఇది వేరే లెవ‌ల్ అంతే!

ఆమెకి అవ‌కాశాలివ్వ‌డానికి ఎవ‌రూ ఆస‌క్తి చూపించ‌లేదు. ఇలాంటి ఉదాహార‌ణ భామ‌లెంతో మంది ఉన్నారు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 2:47 PM GMT
బుట్ట‌బొమ్మ  కంబ్యాక్..ఇది వేరే లెవ‌ల్ అంతే!
X

ఏ న‌టికైనా కంబ్యాక్ అన్న‌ది అంత వీజీ కాదు. ఒక్క‌సారి స‌క్సెస్ ఇచ్చిన ప‌రిశ్ర‌మ గుమ్మం దాటెళ్లిన త‌ర్వాత తిరిగి వ‌ద్దాం? అంటే అవ‌కాశాలివ్వ‌డానికి ఏ ద‌ర్శ‌క‌, నిర్మాత‌, హీరో ముందుకు రారు. ఆప్ష‌న్ గా కొత్త భామ‌ల్ని చూసుకుంటారు గానీ....వెళ్లిపోయిన న‌టిని పిలిచి మ‌రీ పెట్టుకునే సీన్ ఉండ‌దు. అలా ఇండ‌స్ట్రీకి దూర‌మైన భామ‌లెంతో మంది. ఇలియానా టాలీవుడ్ ని అలాగే వ‌దిలి వెళ్లి? తిరిగి మ‌ళ్లీ ఇక్కడ కంబ్యాక్ అవ్వాల‌ని చూసింది కానీ ప‌న‌వ్వ‌లేదు.

ఆమెకి అవ‌కాశాలివ్వ‌డానికి ఎవ‌రూ ఆస‌క్తి చూపించ‌లేదు. ఇలాంటి ఉదాహార‌ణ భామ‌లెంతో మంది ఉన్నారు. కానీ బుట్ట‌బొమ్మ పూజాహోగ్డే విష‌యంలో మాత్రం సీన్ రివ‌ర్స్ లో క‌నిపిస్తుంది. టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న స‌మ‌యంలోనే ఈ అమ్మ‌డు కూడా బాలీవుడ్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ అవ‌కాశం ఉన్నంత కాలం సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు ఛాన్స్ లు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ సౌత్ ఇంట‌స్ట్రీ వైపు చూసింది.

అలా చూసి స‌క్సెస్ అయింది కూడా. అవును అమ్మ‌డు లైన‌ప్ లో ఉన్న సినిమాలు చూస్తే కంబ్యాక్ బ్యాక్ అవ్వ‌డం అంటే ఇది అని! చెప్పాలేమో అనిపిస్తుంది. తొలుత నాగ‌చైత‌న్య స‌ర‌స‌న కొత్త సినిమా ఛాన్స్ అందుకుంది. ఇది తెలుగు సినిమా. అటుపై కోలీవుడ్ హీరో సూర్య న‌టిస్తోన్న 44వ చిత్రంలోనూ ఈ భామ‌నే ఎంపిక చేసారు. తాజాగా ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ 69వ సినిమాలోనూ ఈభామ‌నే హీరోయిన్ గా తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇందులో ఇప్ప‌టికే మిమితా బైజు ఓ హీరోయిన్ గా ఎంపికైంది. కానీ ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఆ స్టోరీడిమాండ్ చేయ‌డంతో మ‌రో భామ‌గా పూజాహెగ్డేని తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం టీమ్ ఆ మెతో సంప్ర‌దింపులు జ‌రుపుతుంది. మ‌రి ఇలా వ‌రుస‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న కంబ్యాక్ లో అవ‌కాశాలు రావ‌డం అంటే చిన్న విష‌య‌మా.