Begin typing your search above and press return to search.

ఏడాదిన్నర‌ త‌ర్వాత బుట్ట‌బొమ్మ మెరుపులా!

అయితే దేవా సినిమా స‌క్స‌స్ మాత్రం రెండు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంది. దేవా స‌క్సెస్ అయితే హిందీలో కొత్త అవ‌కాశాల‌కు ఛాన్స్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   16 Jan 2025 4:37 AM GMT
ఏడాదిన్నర‌ త‌ర్వాత బుట్ట‌బొమ్మ మెరుపులా!
X

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే న‌టించి సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చి ఏడాదిన్న‌రవుతోంది. 'కిసీకా భాయ్ కిసీకా జాన్' త‌ర్వాత ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా రిలీజ్ చేయ‌లేదు. క‌మిట్ అయిన చిత్రాల‌న్నీ ఆన్ సెట్స్ లో ఉండ‌టంతో? ప్రేక్ష‌కుల‌కు దూర‌మ‌వ్వాల్సి వ‌చ్చింది. 'దేవా', 'రెట్రో', ' త‌ల‌ప‌తి 69', 'హే జ‌వానీతో ఇష్క్ హూనా హై' అన్ని చిత్రాలు అన్ సెట్స్ లో ఉన్నాయి. మ‌రి వీటిలో ముందు రిలీజ్ అవుతోన్న చిత్రం ఏది అంటే? 'దేవా' రిలీజ్ కి రెడీ అవుతోంది.

షాహిద్ క‌పూర్ హీరోగా రోష‌న్ అండ్రూ తెర‌కెక్కిస్తోన్న 'దేవా' రిలీజ్ కి సిద్ద‌మ‌వుతోంది. దీనిలో భాగంగా ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఈనెల 21న ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అనంత‌రం చిత్రాన్ని ఈనెల 31న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో పూజాహెగ్డే ఫ‌లితం కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్తో ఎదురు చూస్తోంది. పూజాకి ఇంత‌వ‌ర‌కూ హిందీలో స‌రైన స‌క్సెస్ ఒక్క‌టీ లేదు.

'మొహంజ‌దారో' నుంచి మొన్న‌టి కిసీకా భాయ్ జాన్ వ‌ర‌కూ నాలుగైదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవేవి కూడా సంతృప్తినివ్వ‌లేదు. భారీ అంచ‌నాల మ‌ద్య రిలీజ్ అయినా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ లో అవ‌కాశాలు కూడా స‌న్న‌గిల్లాయి. దీంతో సౌత్ లో మ‌ళ్లీ కంబ్యాక్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నాలు చేసి ఛాన్సులు అందుకోవ‌డం వ‌ర‌కూ స‌క్సెస్ అయింది. సౌత్ లోఅగ్ర హీరోల చిత్రాల‌కే సైన్ చేసి ప‌నిచేస్తోంది.

అయితే దేవా సినిమా స‌క్స‌స్ మాత్రం రెండు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంది. దేవా స‌క్సెస్ అయితే హిందీలో కొత్త అవ‌కాశాల‌కు ఛాన్స్ ఉంటుంది. ఐరెన్ లెగ్ అనే ముద్ర తొల‌గిపోతుంది. ఇక సౌత్ లో కంబ్యాక్ అవుతోన్న‌త‌రుణం నేప‌థ్యంలో? ఫెయిల్యూర్ ఇమేజ్ ప‌డ‌కుండా ఉండాల‌ని బుట్ట‌బొమ్మ భావిస్తోంది. మ‌రేం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.