పిక్‌టాక్ : అందాల పూజ ఎర్ర గులాబీ
టాలీవుడ్‌లో ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో అడుగు పెట్టిన పూజా హెగ్డే పెద్దగా గుర్తింపు సొంతం చేసుకోలేక పోయింది.
By: Tupaki Desk | 15 March 2025 4:03 PM ISTటాలీవుడ్‌లో ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో అడుగు పెట్టిన పూజా హెగ్డే పెద్దగా గుర్తింపు సొంతం చేసుకోలేక పోయింది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోక పోవడంతో బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ మొహెంజదారో సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాలో నటించింది. ఆ సినిమాలో పూజా హెగ్డే గ్లామర్‌తో మెప్పించింది. అంతే కాకుండా నటనతో సరికొత్తగా కనిపించింది. అందుకే టాలీవుడ్‌లో దువ్వాడ జగన్నాథం తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. దాదాపుగా ఐదేళ్ల పాటు టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా సినిమాలు చేసింది.
పూజా హెగ్డే తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, వరుణ్ తేజ్, అఖిల్‌లతో వర్క్ చేసే అవకాశాలు దక్కించుకుంది. ఆ క్రమంలో భారీ విజయాలను కూడా సొంతం చేసుకుంది. కానీ ఈమధ్య కాలంలో పూజా హెగ్డేకి కాలం కలిసి రావడం లేదు. ఆమె నటించిన ఏ ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. దాంతో గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్‌కి దూరంగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్‌తో నటించిన రాధేశ్యామ్ సినిమా తర్వాత పూజా హెగ్డే ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ఈమె అక్కడ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా పూజా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా పూజా హెగ్డే రెడ్ డ్రెస్‌లో విభిన్నమైన లుక్‌తో ఆకట్టుకుంది. ఎర్ర గులాబీలతో తయారు చేసిన అందమైన డ్రెస్‌ను ధరించినట్లుగా పూజా హెగ్డే ఔట్ ఫిట్ ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి లుక్‌తో పూజా హెగ్డే సర్‌ప్రైజ్ చేసింది. పెద్దగా స్కిన్ షో చేయకుండానే పూజా హెగ్డే చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందం ఉన్న పూజా హెగ్డేను అప్పుడే టాలీవుడ్ పక్కన పెట్టడం బాధగా ఉందని, త్వరలో ఆమె తిరిగి టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
బాలీవుడ్‌లో ఇటీవల దేవ సినిమాతో వచ్చి నిరాశ పరిచింది. అక్కడ దేవ హిట్ అయితే కచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకున్నారు. కానీ దేవ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అందుకే హిట్ కోసం మరో సినిమా వచ్చే వరకు ఈ అమ్మడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ అమ్మడు రెండు సినిమాలు చేస్తుంది. మరో వైపు తమిళ్‌లోనూ ఈమె సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా తమిళ్‌లో ఈమె సూర్యతో కలిసి చేస్తున్న రెట్రో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెట్రో సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే తమిళ్‌లో రెండు మూడు ఏళ్ల పాటు బిజీగా ఉండే అవకాశాలు ఉంటాయి.
రెట్రో మాత్రమే కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో ఈమె ఐటెం సాంగ్‌లో కనిపించబోతుంది. ఇక లారెన్స్ సినిమా కాంచన 4 లోనూ ఈమెను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. ఇక సూపర్ స్టార్ విజయ్‌తో చేస్తున్న జన నాయగన్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. తమిళ్‌లో ఈమె ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్న నేపథ్యంలో రెండు హిట్ అయినా కచ్చితంగా మంచి బ్రేక్ దక్కే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఇండస్ట్రీలో మరో నాలుగు ఏళ్ల పాటు కొనసాగే అవకాశాలు ఉంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.