Begin typing your search above and press return to search.

అలా ఎలా పూజ.. ఇది నిజమా? దెయ్యమా?

దెయ్యం గొడవ మనకెందుకు మేడమ్ జీ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అసలేం జరిగింది? పూజా హెగ్డే ఫ్యాన్స్ ఎందుకలా అంటున్నారు? పూర్తి వివరాల్లోకి వెళ్తే

By:  Tupaki Desk   |   11 Sep 2024 9:58 AM GMT
అలా ఎలా పూజ.. ఇది నిజమా? దెయ్యమా?
X

అలా ఎలా పూజ? ఇది నిజమా? దెయ్యమా? మనకెందుకు? అంటూ పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే ఫ్యాన్స్ ఇప్పుడు నెట్టింట తెగ కామెంట్లు పెడుతున్నారు. ఆ విషయం తెలిసి తాము భయపడుతున్నట్లు చెబుతున్నారు. అసలు సెట్ అవుతుందా ఆ రోల్ అంటూ ప్రశ్నిస్తున్నారు. దెయ్యం గొడవ మనకెందుకు మేడమ్ జీ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అసలేం జరిగింది? పూజా హెగ్డే ఫ్యాన్స్ ఎందుకలా అంటున్నారు? పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైమ్ లో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది పూజా హెగ్డే. తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. అలా వైకుంఠపురం మూవీ తర్వాత టాలీవుడ్ బుట్టబొమ్మగా మారిపోయింది. అయితే కొంతకాలంగా ఆమె టైమ్ బాలేదని చెప్పాలి. నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తెలుగులో అవకాశాలు ఆమెకు బాగా తగ్గిపోయాయి.

బాలీవుడ్ లో కూడా హిట్ కొట్టలేకపోయింది. రీసెంట్ గా హిందీ మూవీ దేవా షూటింగ్ ను పూర్తి చేసింది. అయితే సౌత్ లో మళ్లీ అవకాశాలు అందుకోవాలని చూస్తోంది. కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్యతో ఓ సినిమా చేస్తోంది. ఇప్పుడు ఓ దెయ్యం సినిమాలో పూజ నటించనుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. కాంచన-4లో పూజను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

రీసెంట్ గా కాంచన-4ను అనౌన్స్ చేశారు రాఘవ లారెన్స్. 2007లో ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన మునికి సీక్వెల్ గా కాంచన మూవీ వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయిన కాంచనకు సీక్వెల్ గా గంగా 2015లో రిలీజ్ అయింది. ఆ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత యాక్టింగ్ పై ఫోకస్ పెట్టిన లారెన్స్.. తాజాగా కాంచన-4ను ప్రకటించారు. స్టోరీ ఇప్పటికే రెడీ అయిందని తెలిపారు.

కాగా, కాంచన-4ను ప్రముఖ బాలీవుడ్ సంస్థ గోల్డ్ మైన్స్ రూ.100 కోట్లతో రూపొందించనుందని తెలుస్తోంది. తొలుత హీరోయిన్ గా నయనతార అనుకున్నా.. ఆ తర్వాత పూజను ఫిక్స్ చేశారట. ఇప్పుడు ఆ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజమో కాదో తెలియక పోయినా.. గాసిప్ వినే భయపడుతున్నట్లు చెబుతున్నారు. మనకెందుకు దెయ్యం సినిమా పూజ అంటూ కామెంట్లు పెడుతున్నారు.